ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో 4జీ ఇంటర్నెట్​ పునరుద్ధరణ

జమ్ము కశ్మీర్​లో 4జీ అంతర్జాల సేవలపై కేంద్రం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఇంటర్నెట్ సేవలను పునరుద్ధస్తామని స్పష్టం చేసింది. ఈ సేవలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.

kashmir, 4g internet
జమ్ము కశ్మీర్​లో 4జీ ఇంటర్నెట్​ పునరుద్ధరణ!
author img

By

Published : Feb 5, 2021, 10:14 PM IST

జమ్మూకశ్మీర్‌లో 4జీ మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరిస్తున్నట్టు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ఇంటర్నెట్‌ సేవలపై ఎప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. దాదాపు 18 నెలల తర్వాత వాటిని పునరుద్ధరించనుంది. జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా 4జీ మొబైల్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు విద్యుత్‌, సమాచార శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రోహిత్‌ కన్సాల్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఈ సేవలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

2019 ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్రం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతకముందు ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తూ పార్లమెంట్‌లో చట్టం చేసింది. ఆ సమయంలో అక్కడ ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా భారీగా భద్రతా బలగాలను మోహరించడం సహా.. ముగ్గురు మాజీ సీఎంలను సుదీర్ఘ కాలంగా నిర్బంధంలో ఉంచింది. అలాగే, ఇంటర్నెట్‌ సేవలపైనా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి : సభాముఖంగా సాగు చట్టాలపై మోదీ ప్రసంగం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.