ETV Bharat / bharat

వ్యాక్సిన్​పై గ్రామీణుల ఆసక్తి- 'కరోనా​ చైనా కుట్రే'! - 44 per cent of rural Indians

కరోనా టీకా కోసం ఖర్చు చేసేందుకు దేశంలోని 44 శాతం మంది గ్రామీణులు సిద్ధంగా ఉన్నారని ఓ సర్వే వెల్లడించింది. 20 శాతం మంది ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపినట్లు పేర్కొంది. ఇంకా.. కరోనా వైరస్​ సంక్షోభం చైనా కుట్ర అని 51 శాతానికిపైగా గ్రామీణులు అభిప్రాయపడ్డట్లు సర్వే తేల్చింది.

author img

By

Published : Dec 23, 2020, 6:30 AM IST

దేశంలో 44 శాతం మంది గ్రామీణులు కరోనా వ్యాక్సిన్‌ కోసం ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఓ సర్వేలో వెల్లడైంది. డిసెంబర్ 1 నుంచి 10 వరకు.. గ్రామీణ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ఈ సర్వేని నిర్వహించగా ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 16 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 60 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో 36 శాతం మంది తాము కరోనా టీకా కోసం డబ్బు చెల్లించబోమని తెలపగా... 20 శాతం మంది ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

టీకా కొనుగోలుకు డబ్బు చెల్లించే వారిలో మూడింట రెండొంతుల మంది.. వ్యాక్సిన్‌ రెండు మోతాదులకు 500 రూపాయల వరకు ఖర్చు చేస్తామని తెలిపారు.

చైనా కుట్రనే..

కరోనా వైరస్‌ సంక్షోభం చైనా కుట్ర అని 51 శాతానికి పైగా గ్రామీణులు అభిప్రాయపడ్డారు. 18 శాతం మంది కొవిడ్‌ నివారణలో ప్రభుత్వం విఫలమైందని తెలపగా, 22 శాతం మంది.. కరోనా వ్యాప్తికి ప్రజల నిర్లక్ష్యమే కారణమని భావిస్తున్నారు. 20 శాతం మంది దేవుడి వల్లే కరోనా వ్యాప్తి చెందుతుందని విశ్వసిస్తున్నారని సర్వేలో వెల్లడైంది.

ఇదీ చూడండి: తమిళులపై 'ఎమ్​జీఆర్​' అస్త్రం ప్రభావమెంత?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.