girl fell from three storey building: మూడంతస్తుల భవనం నుంచి కింద పడిపోయిన నాలుగేళ్ల బాలిక ఎలాంటి గాయాలు కాకుండా సరక్షితంగా బయపడింది. ఉత్తర్‌ప్రదేశ్ మథుర జిల్లాలో ఈ ఘటన జరిగింది.
కొత్వాలి ప్రాంతంలోని స్వామి ఘాట్‌కు చెందిన దివ్య అనే నాలుగేళ్ల బాలిక... తన తల్లితో కలిసి ఇంటి మూడో అంతస్తుపై ఆడుకుంటోంది.ఈ క్రమంలో దివ్య పైనుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయింది. కింద పడిపోయిన ఆ బాలికకు ఎలాంటి గాయాలుకాలేదు.
అయినప్పటికీ చిన్నారిని కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి హుటాహుటిన జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించారు.
మూడంతస్తుల భవనం నుంచి కిందకు పడిపోయినా... బాలిక సురక్షితంగా ఉండడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం- మైనర్ అరెస్ట్