ఝార్ఖండ్ జంశెద్పుర్లో దారుణం జరిగింది. ఒకే ఇంట్లో ఇద్దరు చిన్నారులు సహా ఓ మహిళ, మరో ట్యూషన్ టీచర్ మృతదేహాలు కనిపించాయి. కాగా.. మహిళ భర్త పరారీలో ఉన్నాడు. కదమా పోలీస్ స్టేషన్ పరిధిలోని తాప్తాలో రోడ్డులో ఈ ఘటన జరిగింది.
అలా వెలుగులోకి..
టాటా స్టీల్ సంస్థలోని అగ్నిమాపక విభాగంలో పని చేసే దీపక్ కుమార్ ఇంట్లో.. అతని భార్య, ఇద్దరు పిల్లలతో పాటు ట్యూషన్ టీచర్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంట్లో నుంచి రక్తపు ధారలు బయటకి రావటాన్ని చుట్టుపక్కల జనం చూడగా.. విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: రెస్టారెంట్లో ఎస్సై దౌర్జన్యం- బదిలీ వేటు