రాజస్థాన్ భీల్వాడా జిల్లా మాండల్గఢ్ పరిధిలోని ఖేడా గ్రామంలో కల్తీమద్యం తాగి ఓ మహిళ సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరికి భీల్వాడాలోని మహాత్మా గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఈ విషయంపై సమాచారం అందిన వెంటనే జిల్లా అధికార యంత్రాంగం గ్రామానికి చేరుకుంది. అధికారులు ఘటనపై ఆరా తీస్తున్నారు.
భరత్పుర్లో కల్తీ మద్యానికి ఏడుగురు బలైన ఘటన మరువక ముందే భీల్వాడాలో ఈ ఘటన జరగడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. కల్తీ మద్యం మాఫియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.