ETV Bharat / bharat

రెండు వారాల్లోనే కరోనా కేసులు 36% వృద్ధి! - bmc covid statistics

మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. ఈ నెల 8 నుంచి మహమ్మారి బారిన పడిన వారి శాతం అమాంతంగా పెరిగినట్లు ముంబయి నగర పాలక సంస్థ (బీఎంసీ) తెలిపింది.

36 pc rise in active COVID-19 cases in Mumbai since Feb 8: BMC
ముంబయిలో 36శాతం పెరిగిన కరోనా కేసులు
author img

By

Published : Feb 22, 2021, 4:26 PM IST

మహారాష్ట్రలోని ముంబయిలో కొవిడ్ పంజా విసురుతోంది. కొత్త కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. ఈ నెల 8 నుంచి ఇప్పటివరకు నగరంలో కొత్త కేసుల శాతం 36.38కి పెరిగినట్లు ముంబయి నగరపాలక సంస్థ ప్రకటించింది.

పౌరుల నిర్లక్ష్య వైఖరి, లోకల్​ రైళ్లలో ప్రయాణాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడం వంటి వాటి కారణంగా కేసులు సంఖ్య అమాంతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 8వ తేదీన ముంబయిలో 5,335 రోజు వారీ కేసులు వెలుగు చూడగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 7,276గా ఉన్నట్లు తెలిపింది. కొత్త కేసులు ఫిబ్రవరి 8న అత్యల్పంగా 0.12 శాతం నమోదుకాగా... ప్రస్తుతం వాటి రేటు రెండింతలు అయినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.

కొత్తగా మహమ్మారి సోకిన వారి సంఖ్య పెరుగుతున్నా.. మరణాలు మాత్రం తక్కువగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

"ప్రజలు చాలా మంది కరోనా అనేది లేనట్లు వ్యవహరిస్తున్నారు. పెళ్లిళ్లు, పార్టీలు, మాల్స్​, రెస్టారెంట్​లు, పబ్​లకు విపరీతంగా వెళ్తున్నారు. లోకల్​ రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య సమారు ఎనిమిది లక్షలు పెరిగింది. కరోనా ఆంక్షలను ప్రజలు పాటించడం లేదు. చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు."

-సురేశ్​ కాకాని, బీఎంసీ అడిషనల్​ మున్సిపల్​ కమిషనర్​

ఇదీ చూడండి: నెలలో ఏడుగురు మంత్రులకు కొవిడ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.