దిల్లీలోని ఆల్ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కొవిడ్ కల్లోలం రేపుతోంది. గత పది రోజుల్లోనే 20 మంది వైద్యులు, ఆరుగురు వైద్య విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. వారిలో ఇద్దరు కరోనా టీకా తీసుకున్నవారు ఉన్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.
కరోనా రెండో దశ ఉద్ధృతితో దిల్లీలోని సర్ గంగా రాం ఆస్పత్రిలో 37 మంది వైద్యలకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దేశ రాజధానిలో రోజువారీ కేసుల సంఖ్య 7వేల మార్కు దాటింది.
భోపాల్‌లో వైరస్ భీభత్సం..
భోపాల్ ఎయిమ్స్నూ కరోనా కుదిపేసింది. గురువారం రాత్రి చేసిన పరీక్షల్లో 38 మంది జూనియర్ వైద్యులు సహా 53 మందికి వైరస్ సోకినట్లు తేలింది. వారిలో 13 మంది ఆరోగ్య కార్యకర్తలున్నారు.
ఇదీ చూడండి: 'కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే.. యమలోకానికే!'