ETV Bharat / bharat

'33 లక్షల మంది చిన్నారుల్లో తీవ్ర పౌష్టికాహార లోపం'

భారత్​లో 33 లక్షల మందికి పైగా చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు కేంద్ర మహిళ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంగన్‌వాడీ వ్యవస్థలో ఉన్న 8.19 కోట్ల చిన్నారుల్లో కేవలం 4.04 శాతం మందిలో మాత్రమే పౌష్టికాహార లోపం సమస్య ఉందని అధికారులు తెలిపారు.

Malnourished
చిన్నారుల్లో ఏదీ లక్ష్య పరిపుష్టి!
author img

By

Published : Nov 8, 2021, 8:11 AM IST

దేశంలో 33 లక్షల మందికిపైగా చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వారిలో సగం మందిలోనైతే ఈ సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. ఇక ఈ జాబితాలోని తొలి మూడు స్థానాల్లో మహారాష్ట్ర, బిహార్‌, గుజరాత్‌లు ఉండడం గమనార్హం. ఇంతకీ ఈ లెక్కలన్నీ.. ఏ అంతర్జాతీయ సంస్థ విడుదలచేసిన నివేదికలోని గణాంకాలో? లేక ప్రతిపక్ష పార్టీల ప్రకటనల్లోనివో.. అనుకుంటున్నారా? కానే కాదు! సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు స్పందనగా కేంద్రం వెల్లడించిన వివరాలివి. ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ అంచనాల ప్రకారం అక్టోబరు 14, 2021 నాటికి.. దేశంలో 17,76,902 మంది చిన్నారులు అత్యంత తీవ్రమైన పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. 15,46,420 మంది పిల్లలు తీవ్రమైన పౌష్టికాహార లోపంతో సతమతమవుతున్నారు.

దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సేకరించిన గణాంకాలను క్రోడీకరించగా మొత్తం 33,23,322 మంది చిన్నారుల్లో సమస్య ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం గతేడాది అందుబాటులోకి తెచ్చిన పోషణ్‌ యాప్‌లో నమోదు చేసిన అంశాల ఆధారంగా ఈ గణాంకాలను రూపొందించారు. 'అంగన్‌వాడీ వ్యవస్థలో ఉన్న 8.19 కోట్ల చిన్నారుల్లో కేవలం 33 లక్షల (4.04 శాతం) మందిలో మాత్రమే పౌష్టికాహార లోపం సమస్య ఉంది' అని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఒకరు చెప్పారు. కరోనా సంక్షోభం కారణంగా అత్యంత పేదవారిలో ఆరోగ్య, ఆహార సంక్షోభం మరింత తీవ్రరూపు దాల్చిందని ఈ సందర్భంగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

  • ఆంధ్రప్రదేశ్‌లో 2,67,228 మంది చిన్నారుల్లో పౌష్టికాహార లోపం సమస్య ఉండగా, 1,97,954 మంది చిన్నారులు అత్యంత తీవ్రమైన పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. అదే సమయంలో కర్ణాటకలో 2,49,463 మంది చిన్నారులు, తమిళనాడులో 1,78,060 మంది చిన్నారులు తీవ్రమైన పౌష్టికాహార లోపంతో సతమతమవుతున్నారు.
  • గతేడాది నవంబరు నాటికి దేశంలో అత్యంత తీవ్రమైన పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారుల సంఖ్య 9,27,606గా ఉండగా, అక్టోబరు 14, 2021 నాటికి ఆ సంఖ్య 91 శాతం మేర పెరిగి 17,76,902కు చేరడం ఆందోళనకర అంశం.

ఇదీ చూడండి: సముద్రంలో ఉండగా ఒక్కసారిగా మంటలు.. పడవలోని ఏడుగురు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.