ETV Bharat / bharat

'ఐదేళ్లలో 326 రాజద్రోహం కేసులు- శిక్ష పడింది ఆరుగురికే!' - రాజద్రోహం చట్టం

ఐదేళ్ల కాలం(2014-19)లో రాజద్రోహ చట్టం కింద దేశంలో 326 కేసులు నమోదయ్యాయని కేంద్రం హోం శాఖ తెలిపింది. అందులో ఆరుగురికి మాత్రమే శిక్ష పడినట్లు పేర్కొంది.

sedition cases in india
రాజద్రోహం కేసులు
author img

By

Published : Jul 18, 2021, 5:09 PM IST

Updated : Jul 18, 2021, 6:19 PM IST

దేశంలో 2014 నుంచి 2019 మధ్య రాజద్రోహ చట్టం కింద 326 కేసులు నమోదయ్యాయి. అందులో ఆరుగురికి మాత్రమే శిక్ష పడింది. ఈమేరకు కేంద్ర హోంశాఖ వివరాలు వెల్లడించింది.

కేంద్రం నివేదిక ప్రకారం.. అత్యధికంగా అసోంలో 54 కేసులు నమోదయ్యాయి. మొత్తం 326 కేసుల్లో 141 కేసుల్లో అభియోగపత్రం​ దాఖలైంది. 2020 ఏడాదికి సంబంధించిన సమాచారాన్ని నివేదికలో చేర్చలేదు.

ఐదేళ్లలో ఈవిధంగా కేసులు నమోదయ్యాయి.

సంవత్సరంమొత్తం కేసులుశిక్షపడినవి
2014471
201530-
2016351
2017511
2018702
2019931

భారతీయ శిక్షా స్మృతి సెక్షన్​ 124ఏ(రాజద్రోహ చట్టం)పై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. చట్టం దుర్వినియోగానికి గురవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. బ్రిటీష్​ కాలంనాటి ఈ చట్టాన్ని ఎందుకు తొలగించలేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ ఐదేళ్లలో రాజద్రోహం చట్టం కింద ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎన్ని కేసులు నిలబడ్డాయి? అనే వివరాలు సమర్పించాలని ఆదేశించింది.

ఇదీ చదవండి:'నిన్నటి కేసు ఇవాళ పెండింగ్​ అవుతుందా?'

Last Updated : Jul 18, 2021, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.