గతేడాది దిల్లీలో 32 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. గత నాలుగేళ్లలో ఇదే అత్యధికమని వారు పేర్కొన్నారు. 2016లో 16, 2017లో 11, 2018లో 8, 2019లో 5 మందిని అరెస్టు చేశామన్నారు. ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్కు ప్రభావితమై తీవ్రవాద కార్యకలాపాలకు ప్రయత్నించిన పలువురిని గతేడాది పట్టుకున్నామని తెలిపారు.
"జిహాదీ ఉగ్రవాదానికి పాకిస్థాన్ ప్రధాన ఎగుమతి దారు. అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు, నకిలీ భారతీయ కరెన్సీ నోట్ల తయారీకి ఆతిథ్యం ఇచ్చే దేశం అది. అఫ్గానిస్థాన్‌లోని కాందహార్ నుంచి ఇరాన్‌లోని చబహార్ పోర్టు మీదుగా ముంబయి చేరుతున్న మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నాం."
-దిల్లీ పోలీసులు
అక్రమ రవాణ..
గతేడాది మొత్తం 549 పిస్టోళ్లు, రైఫిళ్లు సహా 1,505 కేట్రిడ్జెస్లను స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. అక్రమ రవాణకు పాల్పడిన 33 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 73.3 హెరాయిన్, 31.6 కేజీల ఒపియమ్, 233 కేజీల సింథటిక్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
నకిలీ కరెన్సీ నోట్ల పంపిణీకి పాల్పడ్డ 8 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఆ నకిలీ సొమ్ము 7.8 లక్షలు విలువ చేస్తుందని అన్నారు.
ఇదీ చదవండి : అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ తీర్పుపై భారత్ 'సవాల్'?