ETV Bharat / bharat

ఒక్కరోజే 78 మంది ఎంపీలపై సస్పెన్షన్- పార్లమెంట్​ సమావేశాలకు 92 మంది దూరం

33 Lok Sabha MPs Suspended From Lok Sabha : పార్లమెంట్​లో ఒకేరోజు 78 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్​ ఎంపీ అధీర్​ రంజన్​ చౌదరి సహా మొత్తం 33 మంది ప్రతిపక్ష ఎంపీలు లోక్​సభ నుంచి సస్పెండ్ అయ్యారు. రాజ్యసభలో 45 మందిపై వేటు పడింది.

33 Lok Sabha MPs Suspended From Lok Sabha

author img

By PTI

Published : Dec 18, 2023, 3:22 PM IST

Updated : Dec 18, 2023, 5:28 PM IST

33 Lok Sabha MPs Suspended From Lok Sabha : పార్లమెంట్​లో అసాధారణ పరిణామం! ఒకే రోజు ఉభయ సభల్లో 78 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. పార్లమెంట్​లో భద్రతా వైఫల్యంపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో 33 మంది ఎంపీలను లోక్​సభ స్పీకర్ సస్పెండ్ చేశారు. అందులో 30 మందిపై శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని సభాపతి ప్రకటించారు. మరోవైపు, రాజ్యసభలో 45 మందిపై వేటు పడింది. అందులో 34 మందిపై శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగనుంది. ఇదివరకే పార్లమెంట్ నుంచి 14 మంది ఎంపీలు సస్పెన్షన్​కు గురయ్యారు. సోమవారం నాటి సంఖ్యతో కలిపి ఇప్పటివరకు సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 92కు చేరింది.

సోమవారం సస్పెండ్​ అయిన లోక్​సభ సభ్యుల్లో కాంగ్రెస్ లోక్​సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీ టీఆర్​ బాలు, దయానిధి మారన్​, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్​ తదితరులు ఉన్నారు. ఇందులో ముగ్గురు ఎంపీలు కే జయకుమార్​, విజయ్​ వసంత్​, అబ్దుల్​ ఖలీక్​ను లోక్​సభ ఘటనకు సంబంధించి సభా హక్కుల​ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్​ చేశారు. మిగతా వారిపై శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సస్పెన్షన్​కు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిని వాయిస్​ ఓటింగ్ ద్వారా ఆమోదింపజేశారు స్పీకర్​.

33 Lok Sabha MPs Suspended From Lok Sabha
లోక్​సభ నుంచి సస్పెండ్​ అయిన 33 మంది ఎంపీలు వీరే

మరోవైపు, రాజ్యసభ నుంచి 45 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్ జగదీప్ ధన్​ఖడ్ ప్రకటించారు. అందులో 34 మంది ఎంపీలు ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు సభకు హాజరు కాకూడదని స్పష్టం చేశారు. మిగిలిన 11 మంది ఎంపీల ప్రవర్తనపై ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. కమిటీ నివేదిక వచ్చేంత వరకు వారిపై సస్పెన్షన్ కొనసాగుతుందని ధన్​ఖడ్ వివరించారు.
కాగా, లోక్​సభలో సస్పెన్షన్​పై కాంగ్రెస్ ఎంపీ అధీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • #WATCH | On his suspension from the Lok Sabha, Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury says, "All leaders, including me, have been suspended. We have been demanding for days to reinstate our MPs who were suspended earlier and that the Home Minister come to the… pic.twitter.com/y19hCUY7iG

    — ANI (@ANI) December 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నాతో పాటు మరికొంతమంది ప్రతిపక్ష ఎంపీలను కూడా ఈరోజు సస్పెండ్​ చేశారు. ఇటీవలే సస్పెండ్​ అయిన మా ఎంపీలపై ఉన్న సస్పెన్షన్​ వేటును ఎత్తివేయాలని మేము డిమాండ్​ చేస్తున్నాము. ఈ వ్యవహారంపై హోం మంత్రి వచ్చి ప్రకటన చేయాలి. ఆయన(హోం మంత్రి) ప్రతిరోజు టీవీల ముందు స్టేట్​మెంట్స్​ ఇస్తారు. పార్లమెంటులో భద్రతకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా కాస్త సభలో చెబితే బాగుంటుంది. ప్రతిపక్షాల పట్ల వారు అనుసరిస్తున్న తీరు దారుణం. మేము చర్చను మాత్రమే కోరుకుంటున్నాము."
- అధీర్​ రంజన్​ చౌదరి, కాంగ్రెస్​ ఎంపీ

'ఆయనకు కావాల్సిన చట్టాలను చేసుకుంటారు'
'ముందుగా దుండగులు పార్లమెంటుపై దాడి చేశారు. ఆ తర్వాత మోదీ ప్రభుత్వం పార్లమెంటు సహా ప్రజాస్వామ్యంపై దాడికి దిగింది. ఇప్పటివరకు మొత్తం 47 మంది ఎంపీలను సస్పెండ్​ చేయడం ద్వారా నిరంకుశ ప్రభుత్వం అన్ని ప్రజాస్వామ్య నిబంధనలను చెత్తబుట్టలో వేసినట్లయింది. ఇక సభలో తక్కువ మంది ప్రతిపక్ష ఎంపీల మధ్యే ఎటువంటి చర్చ లేకుండానే మోదీ తనకు కావాల్సిన, పెండింగ్​లో ఉన్న ముఖ్యమైన చట్టాలను ఆమోదింపజేసుకోవచ్చు' అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్విట్టర్​ వేదికగా లోక్​సభ ఎంపీల సస్పెన్షన్​ వేటుపై స్పందించారు.

కాగా, పార్లమెంటులో సంభవించిన భద్రతా వైఫల్యంపై విపక్షాల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం కూడా అదే పరిస్థితి నెలకొంది. దీంతో లోక్​​సభను మంగళవారానికి వాయిదా వేశారు స్పీకర్​. రాజ్యసభలోనూ కార్యకలాపాలు స్తంభించాయి.

మినీబస్సు బానెట్​పై మనిషి- అలాగే కి.మీ దూసుకెళ్లిన డ్రైవర్!

శబరిమల ప్రసాదం గురించి మీకు ఈ విషయాలు తెలుసా? - అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి!

Last Updated : Dec 18, 2023, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.