తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల విషయంలో ఔరంగబాద్ బాటలోనే నడుస్తోంది లాతూర్ జిల్లా పరిషత్. ఉద్యోగుల జీతంలో 30 శాతం కోత విధించి.. వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసింది.
పిల్లలు తమను పట్టించుకోవడం లేదని 11 మంది తల్లిదండ్రులు అధికారులను ఆశ్రయించగా.. వారికి నగదు బదిలీ చేసింది లాతూర్ జిల్లా పరిషత్.
ఉద్యోగులకు తల్లిదండ్రుల పట్ల బాధ్యతను పెంచేలా లాతూర్ జిల్లా పరిషత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విధానం పక్కాగా అమలయ్యేలా జడ్పీ ప్రెసిడెంట్ 'రాహుల్ కేంద్రే' స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
మహారాష్ట్రలోని ఔరంగబాద్ జిల్లా పరిషత్ తొలిసారి ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టింది. విధి నిర్వహణలో ఒత్తిడి కారణంగా.. తల్లిదండ్రులపై అలసత్వం ప్రదర్శిస్తే సంబంధిత సిబ్బంది వేతనంలో 30శాతం కోత విధించాలని ప్రతిపాదించింది.
ఇదీ చదవండి: 'కరోనాకు త్వరలో 19 టీకాలు!'