ETV Bharat / bharat

కశ్మీర్​లో ముగ్గురు ఉగ్ర అనుచరులు అరెస్ట్​ - ఉగ్ర సహచరులు అరెస్టు

లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్ర అనుచరులను (Militant Arrested in Jammu) పోలీసులు జమ్ముకశ్మీర్​లోని కుల్గాం జిల్లాలో అరెస్ట్​ చేశారు. వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

3 militant associates of LeT arrested
ఉగ్ర అనుచరులు అరెస్టు
author img

By

Published : Oct 1, 2021, 7:54 PM IST

ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాద అనుచరులను (Militant Arrested In Jammu) జమ్ముకశ్మీర్​లోని కుల్గాం జిల్లాలో అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిని అబిద్​ ముస్తాక్​, ఆదిల్​ జమాల్​ భట్​, దినీష్​ రసూల్​ భట్​గా అధికారులు గుర్తించారు. వీరంతా పుల్వామాలోని త్రాల్​ అనే ప్రాంతానికి చెందిన వారని పేర్కొన్నారు.

భద్రతా దళాలు కుల్గాంలోని మీర్​ బజార్​ వద్ద వాహనాలన తనిఖీ చేస్తున్నప్పుడు నిందితులు కారు, మోటార్​ సైకిల్​పై వచ్చారని తెలిపారు. వెంటనే గుర్తించిన సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

నిందితుల నుంచి నాలుగు హ్యాండ్​ గ్రనేడ్​లు, నాలుగు డిటోనేటర్లు, ఒక ఐఈడీ, ఒక ఐఈడీ వైర్​, ఒక ఏకే 47 షార్ట్​ రైఫిల్​, ఒక మ్యాగజైన్​, 30 పిస్టల్​ రౌండ్లు స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.

అక్రమ చొరబాటు..

పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. పూంఛ్​ సెక్టార్​లోని నియంత్రణ రేఖ (LOC News) వద్ద భారత్​లోకి అక్రమంగా చొరబడుతుండగా పట్టుకున్నారు.

''సుమారు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​కు చెందిన ఓ వ్యక్తి భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డాడు. అతడిని మన భద్రతాదళాలు మెంఢార్​ నదీ పరీవాహక ప్రాంతంలోని బల్నోయ్​ వద్ద అదుపులోకి తీసుకున్నాయి."

- అధికారులు

అయితే దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

ఇదీ చూడండి: కళాశాలలోనే విద్యార్థిని తల నరికేసిన ప్రేమోన్మాది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.