ETV Bharat / bharat

స్నేహం ప్రూవ్​ చేసుకోవాలని కాలువలోకి దూకిన ముగ్గురు.. చివరకు.. - మద్యం మత్తులో కాలువలోకి దూకిన స్నేహితులు

Friends Jumped In Canal: మద్యం మత్తులో ముగ్గురు ప్రాణ స్నేహితులు.. తమ స్నేహ బంధాన్ని నిరూపించుకోవడానికి నీటి కాలువలోకి దూకారు. వెంటనే గమనించిన స్థానికులు ఒకరిని కాపాడగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ఘటన హరియాణాలో జరిగింది.

3 friends jump into canal to prove friendship; one rescued, rest untraceable

author img

By

Published : Jul 8, 2022, 11:57 AM IST

Three Friends Jumped In Canal: సాధారణంగా స్నేహితుల మధ్య కొన్ని కమిట్​మెంట్స్​ ఉంటాయి. సందర్భానుసారం వాటిని వారు నిరూపించుకుంటారు. కానీ హరియాణాకు చెందిన ముగ్గురు స్నేహితులు మాత్రం ఒకరిపై ఒకరికి ఉన్న స్నేహ బంధాన్ని నిరూపించుకునేందుకు ఒకేసారి నీటి కాలువలోకి దూకారు. వెంటనే గమనించిన స్థానికులు.. అమిత్​ గుప్తను (24) రక్షించారు. మరో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న స్థానిక పోలీస్​​ ఇన్​స్పెక్టర్​ యోగేశ్​ కుమార్​ ఘటనాస్థలానికి చేరుకున్నారు. కాలువలో దూకడానికి ముందు ముగ్గురు యువకులు కలిసి మద్యం సేవించినట్లు ఆయన తెలిపారు. అనంతరం దుస్తులను తొలిగించి.. మొబైల్​ ఫోన్​ సహా పలు వస్తువులను కాలువ గట్టుపైనే పెట్టారని చెప్పారు. గల్లంతైన మోను(26), సంజీవ్​(28) కోసం ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు గాలిస్తున్నాయని అన్నారు.

ఇవీ చదవండి: నదిలో కొట్టుకుపోయిన టూరిస్ట్​ కారు.. 9 మంది జలసమాధి.. ఒక్కరు సేఫ్​!

వరద నీటిలో బోల్తాపడ్డ స్కూల్​ బస్సు.. 8 మంది విద్యార్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.