ETV Bharat / bharat

నదిలో పడి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి - నదిలో పడి ముగ్గురు మృతి

తమిళనాడులోని కడలూరులో విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు నదిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తెన్‌పెన్నై​ నదిలో సరదాగా సెల్ఫీలు తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది.

.
.
author img

By

Published : Nov 16, 2021, 5:01 AM IST

నదిలో పడి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

సరదాగా గడిపేందుకు నదీ తీరానికి వెళ్లిన ఓ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తు నదిలో పడి మృతిచెందారు. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో జరిగింది.

ఇదే జరిగింది..

కడలూరు జిల్లా ముళ్లిగ్రామ్‌పట్టు ప్రాంతానికి చెందిన లోకేశ్వరన్‌.. తన కుటుంబసభ్యులతో కలిసి దగ్గర్లోని తెన్‌పెన్నై నదికి వెళ్లారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా తమిళనాడులో నదులు పొంగిపొర్లుతున్నాయి.

.
.

ఈ నేపథ్యంలో.. ఒడ్డున కూర్చుని అంతా సెల్ఫీలు తీసుకుంటూ ఆనందంగా గడిపారు. ఆ సమయంలో లోకేశ్వరన్‌ ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. కాపాడే ప్రయత్నంలో అతని చెల్లెలు, సోదరుడు నదిలో దూకారు.

.
.

ఈ క్రమంలో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురి మృతదేహాలను బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: Live Video: రూ.2500 కోసం ఫ్రెండ్​ను కత్తితో పొడిచి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.