ETV Bharat / bharat

వయసు 23 నెలలే.. ప్రపంచ రికార్డుల్లో చోటు.. ఈ బుడ్డోడి తెలివికి సలాం! - అనునయ్ బేబి కౌటిల్య

సరిగ్గా రెండేళ్ల వయసు కూడా లేని ఓ బాలుడు.. తన ప్రతిభతో అందరినీ ఫిదా చేస్తున్నాడు. తెలివితేటలతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్​లో చోటు సంపాదించుకున్నాడు. ఆ బుడ్డోడి విశేషాలేంటో తెలుసుకుందామా..

Anunay Baby Kautilya
అనునయ్ బేబి కౌటిల్య
author img

By

Published : Dec 18, 2022, 10:10 PM IST

ఈ బుడ్డోడి తెలివికి సలాం

మధ్యప్రదేశ్​ బాలాఘాట్‌కు చెందిన ఓ బుడ్డోడు తన ప్రతిభతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్​లో చోటు సంపాదించుకున్నాడు. ఈ చిన్నారి వయసు 23 నెలలే. అయితే ఇంత చిన్న వయసున్న చిన్నారి ఏం చేసి అంత గొప్ప గుర్తింపు పొందాడు? అనే అనుమానాలు వస్తాయి. అయితే ఈ పిల్లాడికి ఉన్న జ్ఞాపకశక్తి, తెలివితేటల గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. చిన్నారి కౌటిల్యగా పేరుగాంచిన ఇతడి పేరు అనునయ్ గఢ్‌పాలే. ఈ చిన్నారి ప్రత్యేకత ఏటంటే, ఒకసారి విన్న విషయాలను అస్సలు మరచిపోడు. కేవలం 23 నెలల వయసులోనే ఈ బాలునికి హిందీ, ఇంగ్లీషు భాషలపై అవగాహన ఉంది.

ఒక వ్యక్తి ఏదైనా నేర్చుకునేందుకు సంవత్సరాల సమయం పడుతుంది. అయితే ఈ బాలుడు మాత్రం ఇంత చిన్న వయసులో 40 కంటే ఎక్కువ దేశాల జెండాలను చూసి గుర్తుపట్టి ఆ దేశాల పేర్లు చెప్పగలడు. 60కి పైగా వస్తువులను చూసి వాటి పేర్లను చెప్పగలడు. ఈ బాలునికి పక్షులు, జంతువులు, పువ్వులు, కూరగాయలు చిత్రాలను చూపిస్తే.. వాటి పేర్లను ఇంగ్లీషులో చెప్పేస్తాడు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి నుంచి గొప్ప వ్యక్తుల వరకు చాలా ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను చెప్తాడు.

ఈ చిన్నారి తండ్రి పేరు అనిమేష్ గర్పాల్. ఈయన బాలాఘాట్‌లో జిల్లా రవాణా అధికారి. తన అనునయ్​కు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ అని చెప్పారు. ఒక వస్తువు, పేరు, చిత్రాన్ని ఒకసారి చూస్తే అది ఎప్పటికీ మర్చిపోడని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు చిన్నారిని సానపెట్టడం ప్రారంభించారు. ఈ విషయంలో చిన్నారి తల్లి విద్యా గర్పాల్.. తీరిక సమయంలో చిన్నారి తెలివితేటలను పెంచేందుకు తోడ్పడేవారు.

తన కుమారుడు ఇతర పిల్లలకంటే భిన్నంగా ఉంటాడని విద్యా చెబుతున్నారు. ఆటలు ఆడటం, మొబైల్​లో కార్టూన్లు చూడటం కంటే గొప్ప వ్యక్తుల చిత్రాలతో కూడిన అక్షరమాలలు, సంఖ్యలు, రంగురంగుల పుస్తకాలు చదవడం, చూడటం అతనికి ఇష్టమని తెలిపారు. చిన్నారి తండ్రి సైతం తన కుమారుడి ప్రతిభ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. "నా బిడ్డలో ఉన్న అసాధారణమైన ప్రతిభకు మంచి గుర్తింపు రావాలని ఉద్దేశంతో ఓ వీడియోను రూపొందించాం. మేము ఆ వీడియోను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపాం. అక్కడ నెల రోజుల సెలక్షన్ తర్వాత నా కొడుకు అనునయ్ అవార్డుకు ఎంపికయ్యాడు. సైంటిస్ట్ కావాలన్నది అనునయ్ డ్రీం" అనిమేష్ తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.