ETV Bharat / bharat

కేరళలో కరోనా విజృంభణ- కొత్తగా 22వేల కేసులు

కరోనా, జికా వైరస్​ల విజృంభణతో కేరళలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 22వేల కరోనా కేసులు నమోదు కాగా మరో 5 మందికి జికా వైరస్​ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం జికా కేసుల సంఖ్య 56కి చేరింది.

covid cases latest, కేరళ కరోనా కేసులు
కేరళలో కరోనా విజృంభణ- కొత్తగా 22వేల కేసులు
author img

By

Published : Jul 28, 2021, 1:58 AM IST

కేరళలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. కొత్తగా రాష్ట్రంలో 22,129 మందికి కరోనా సోకగా.. 13,145 మంది కోలుకున్నారు. 156 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది.

రాష్ట్రంలో కేసుల వివరాలు..

మొత్తం కేసులు : 33,05,245

కోలుకున్నవారు : 31,43,043

మృతుల సంఖ్య : 16,326

యాక్టివ్ కేసులు : 1,45,371

అత్యధికంగా మలప్పురం జిల్లాలో 4,037 కేసులు నమోదయ్యాయి. త్రిసూర్​ (2,623), కోజికోడ్ (2,397), ఎర్నాకులం (2,352), పాలక్కడ్​ (2,115) ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.

చాపకింద నీరులా జికా..

మరోవైపు జికా వైరస్​ రాష్ట్రంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కొత్తగా మరో ఐదుగురికి పాజిటివ్​ అని నిర్ధారణ అయింది. దీంతో మొత్తం జికా కేసుల సంఖ్య 56కి చేరింది.

ఇదీ చదవండి : పెద్దలకు మాత్రమే.. అస్సలు మిస్​ కావద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.