ETV Bharat / bharat

కదిలే కారులో యువతిపై సామూహిక అత్యాచారం - యువతిపై రేప్​

ఎన్ని చట్టాలు తెచ్చినా, కఠిన శిక్షలు విధించినా మహిళలపై అఘాయిత్యాలు ఆగటం లేదు. దేశ రాజధాని నడిబొడ్డున మరో అమానుష ఘటన జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తీసుకెళ్లి.. కదిలే కారులో 22 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు దుండగులు.

gang-rape
సామూహిక అత్యాచారం
author img

By

Published : Aug 19, 2021, 10:11 AM IST

దేశ రాజధానిలో మరో అమానుష ఘటన జరిగింది. కదిలే కారులో 22 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. కారులో ఎక్కించుకుని దారుణానికి పాల్పడ్డారని ఆరోపించింది బాధితురాలు. దాడిని ప్రతిఘటించగా చంపేస్తామని బెదిరించారని, ఈశాన్య దిల్లీ శాస్త్రీ పార్క్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

ఇదీ జరిగింది..

గాజియాబాద్​ ప్రాంతంలో తన భర్తతో కలిసి నివాసిస్తోంది బాధితురాలు. కొద్ది రోజుల క్రితం గుర్తుతెలియని నంబర్​ నుంచి ఫోన్​కాల్ వచ్చింది. తన పేరు రోహిత్​గా చెప్పుకున్న వ్యక్తి ఉద్యోగం గురించి అడిగాడు. మాటలు కలిపి.. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. దాంతో ఆగస్టు 16న అతన్ని కలిసేందుకు వెళ్లింది బాధితురాలు. ఈ క్రమంలో యువతిని తీసుకెళ్లేందుకు గాజియాబాద్​ లాల్​కౌన్​ ప్రాంతానికి వచ్చాడు రోహిత్​. అతనితో పాటు కారులో మరోవ్యక్తి ఉన్నాడు. ప్రధాన నిందితుడు రోహిత్​ మహిళతో కలిసి వెనుకాల సీట్లో కూర్చున్నాడు. ఇరువురు యువతిని తీసుకుని దిల్లీ వచ్చారు. కదిలే కారులోనే యువతిపై రోహిత్​ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అతను కారు నడిపితే.. మరోవ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఆ తర్వాత శాస్త్రీ పార్క్​ ప్రాంతంలో వదిలేసి వెళ్లారు.

అనంతరం మహిళా హెల్ప్​లైన్​కు ఫోన్​ చేసి సాయం కావాలని యువతి కోరినట్లు చెప్పారు పోలీసులు. వెంటనే బాధితురాలి వద్దకు చేరుకుని ఆసుపత్రికి తరలించామని, ఫిర్యాదు నమోదు చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేసినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: Rape: కదిలే బస్సులో బాలికపై అత్యాచారం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.