ETV Bharat / bharat

22ఏళ్ల యువతి ఆ గ్రామానికి సర్పంచ్​! - హిమాచల్ ప్రదేశ్ లోవర్​కోటి

హిమాచల్ ప్రదేశ్​లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో లోవర్​కోటి గ్రామానికి 22 ఏళ్ల యువతి సర్పంచ్​గా ఎన్నికయ్యారు. సేవే ప్రధానం అంటున్న ఆ యువతి ప్రస్తుతం గ్రామీణాభివృద్ధిపై దూరవిద్య అభ్యసిస్తున్నారు.

himachal pradesh, shimla, panchayati elections
గ్రామపెద్దగా 22 ఏళ్ల అమ్మాయి!
author img

By

Published : Jan 19, 2021, 12:11 PM IST

హిమాచల్​ ప్రదేశ్​ సిమ్లా జిల్లా రోహ్రు తాలుకాలోని లోవర్​కోటి గ్రామానికి 22 ఏళ్ల యువతి సర్పంచ్​గా ఎన్నికయ్యారు. అవంతిక అనే ఈ అమ్మాయి దిల్లీ విశ్వవిద్యాలయంలో బీ.కాం పూర్తిచేసి ప్రస్తుతం గ్రామీణాభివృద్ధిపై దూరవిద్య అభ్యసిస్తున్నారు. తన పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

సేవే ప్రధానం..

పేదలకు సేవ చేయడం సహా గ్రామం అభివృద్ధికి పాటు పడతానని అవంతిక తెలిపారు. ఈ చర్యలతో రాష్ట్రంలో లోవర్​కోటి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రభుత్వం అందించే వివిధ పథకాలను క్షేత్రస్థాయిలో అందరికీ అందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : ఆమె వయసు 13.. రాసిన నవలలు 12

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.