తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ భారీగా అక్రమ నగదు పట్టుబడుతోంది. ఇప్పటివరకూ నిర్వహించిన దాడుల్లో మొత్తం రూ.217.35 కోట్లు విలువ చేసే నగదు, వస్తువులు సీజ్ చేసినట్లు తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సగు తెలిపారు.
వీటిలో..
- రూ.80.88 కోట్ల నగదు.
- 404 కిలోల బంగారం(రూ.117కోట్లు).
- 299 కిలోల వెండి(రూ.1.65కోట్లు).
- 1,18,524.37 లీటర్ల మద్యం(రూ.1.61కోట్లు ) పట్టుబడినట్లు ఎన్నికల అధికారి వివరించారు.
ఇదీ చదవండి: ఓటర్లకు డబ్బులు పంచిన అన్నాడీఎంకే నేత