ETV Bharat / bharat

మూడు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్​.. ఈశాన్యాన ఎగిరే జెండా ఎవరిది?

author img

By

Published : Mar 1, 2023, 4:20 PM IST

మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గురువారం తేలిపోనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

tripura-nagaland-meghalaya-counting-result

సార్వత్రికం సెమీఫైనల్​లో తొలి గోల్స్ కొట్టేది ఎవరో కొద్ది గంటల్లో తేలిపోనుంది. మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ గురువారం జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం. సాయంత్రం వరకు ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మూడు ఈశాన్య రాష్ట్రాల్లో 60 చొప్పున అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. నాగాలాండ్​, మేఘాలయలో ఒక్కో అసెంబ్లీ సీటు ఏకగ్రీవం అయ్యాయి. నాగాలాండ్​లో 59 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. నాలుగు పోలింగ్ స్టేషన్లలో రీఓటింగ్​కు ఎన్నికల సంఘం ఆదేశించింది. బుధవారం ఈ స్టేషన్లలో రీపోలింగ్ చేపట్టింది.

నాగాలాండ్​లో ఎన్నికలు నిర్వహించిన 59 సీట్లకు 183 మంది పోటీ పడ్డారు. రాష్ట్రంలో మొత్తం 13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 83.63 శాతం మంది ఓటేశారు. అధికార నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ- బీజేపీ కూటమి కలిసి పోటీ చేశాయి. 40:20 నిష్పత్తిలో రెండు పార్టీలు సీట్లు పంచుకున్నాయి. మరోసారి రాష్ట్రంలో విజయం సాధించాలని ఈ పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. నాగా పీపుల్స్ ఫ్రంట్ 21 సీట్లలో బరిలో ఉంది. 19 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ భాజపా కూటమికే సానుకూలంగా ఉన్నాయి. 38-48 సీట్లు ఈ కూటమి గెలుస్తుందని అంచనా వేశాయి.

నాగాలాండ్​లో ఓటర్లు

మేఘాలయలో సైతం ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఏకగ్రీవం అయింది. దీంతో 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ స్థానాలకు 369 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీ, బీజేపీ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు సైతం బరిలో ఉన్నాయి. మేఘాలయలో పోలింగ్ శాతం 85.25గా నమోదైంది. ఇక్కడ హంగ్ వచ్చే ఆస్కారం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఏ పార్టీకీ తగిన మెజార్టీ రాకపోవచ్చని పేర్కొన్నాయి. 21-26 స్థానాలు దక్కించుకొని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్​పీపీ) అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. భాజపా 6-11, కాంగ్రెస్ 3-6, టీఎంసీ 8-13, ఇతరులు 10-19 సీట్లు గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

మేఘాలయలో ఎకో ఫ్రెండ్లీ మోడల్ పోలింగ్ స్టేషన్

మూడు రాష్ట్రాల్లో తొలుత ఎన్నికలు జరిగింది త్రిపురలోనే. ఈ రాష్ట్రానికి ఫిబ్రవరి 16న పోలింగ్ నిర్వహించింది ఈసీ. ఓటింగ్ శాతం సైతం ఇక్కడే అధికంగా నమోదైంది. అర్హులైన ఓటర్లలో ఏకంగా 88 శాతం మంది ఎన్నికల్లో భాగమయ్యారు. ఎన్నికల్లో 259 మంది పోటీ పడుతున్నారు. ఐపీఎఫ్‌టీతో కలిసి భాజపా పోటీ చేస్తోంది. సీపీఎం-కాంగ్రెస్‌ సంయుక్తంగా బరిలో నిలిచాయి. ప్రద్యోత్ విక్రమ్ మాణిక్య దేవ్ వర్మ నేతృత్వంలోని తిప్రా మోథా పార్టీ సొంతంగానే ఎన్నికల్లో తలపడుతోంది. ఇక్కడా కాషాయ జెండానే ఎగిరే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. భాజపా కూటమికి 29-36 సీట్లు వస్తాయని, వామపక్ష కూటమికి 13-21 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. తిప్రా మోథా పార్టీ 11-16 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నాయి.

త్రిపురలో ఎన్నికల సందర్భంగా బారులు తీరిన ఓటర్లు

మరో ఆరు ఎన్నికలు..
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికలతో 2023 ఎలక్షన్ సీజన్ ప్రారంభమైనట్లైంది. ఈ ఏడాది మరో ఆరు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణ భారతంలో తెలంగాణ, కర్ణాటక అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఛత్తీస్​గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్​కు సైతం ఈ ఏడాదే ఎన్నికలు ఉన్నాయి. ఈశాన్య, దక్షిణ, మధ్య భారతంలోని ఈ రాష్ట్రాల ఫలితాలు.. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈశాన్యంలో ఎవరి హవా ఉంటుందనేది త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికలతో తేలిపోనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.