ETV Bharat / bharat

'మోదీ సభలో ఉగ్రదాడి' కేసులో నలుగురికి ఉరిశిక్ష - gandhi maidan blast

2013 పట్నా గాంధీ మైదాన్​లో వరుస బాంబు పేలుళ్ల కేసులో ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెలువరించింది. మొత్తం 9మందిలో నలుగురు దోషులకు మరణశిక్ష, ఇద్దరికి జీవితఖైదు, మరో ఇద్దరికి పదేళ్లు, ఒకరికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. నాటి ప్రధాని అభ్యర్థి మోదీ నిర్వహించాల్సిన గాంధీ మైదాన్​ను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లు జరిగాయి.

2013 Gandhi Maidan blasts case: NIA to deliver quantum of punishment
ఎన్​ఐఏ
author img

By

Published : Nov 1, 2021, 4:15 PM IST

Updated : Nov 1, 2021, 4:41 PM IST

2013 పట్నా గాంధీ మైదాన్​లో వరుస బాంబు పేలుళ్ల కేసులో ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టు దోషులకు శిక్ష ఖరారు చేసింది. మొత్తం 9 దోషుల్లో నలుగురికి మరణశిక్ష విధించింది. ఇద్దరికి జీవితఖైదు, మరో ఇద్దరికి 10 ఏళ్లు, ఒకరికి ఏడేళ్ల జైలు శిక్ష వేసింది.

2013 అక్టోబర్​ 27న.. నాటి భాజపా ప్రధాని అభ్యర్థి మోదీతో పాటు అనేక మంది కమలదళ నేతలు బిహార్​లో ర్యాలీలు నిర్వహించాల్సి ఉంది. ఈ తరుణంలో వరుస పేలుళ్లు రాష్ట్రాన్ని కుదిపేశాయి. మోదీ ర్యాలీ నిర్వహించాల్సిన హుంకర్​లోని గాంధీ మైదాన్​ లక్ష్యంగా ఈ పేలుళ్లు జరిగాయి. అనంతరం పట్నా రైల్వే స్టేషన్​లోనూ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 84మంది గాయపడ్డారు.

2013 నవంబర్​ 6న ఈ కేసు దర్యాప్తును ఎన్​ఐఏ చేపట్టింది. 2014 ఆగస్టులో 11మందిపై ఛార్జ్​షీట్​ దాఖలు చేసింది. వీరిలో 10మంది సిమి(స్టూడెంట్స్​ ఇస్లామిక్​ మూవ్​మెంట్​ ఆఫ్​ ఇండియా)కి చెందినవారు. మరో వ్యక్తి మైనర్​ కావడం వల్ల అతడిని మూడేళ్ల పాటు జువెనైల్​ హోంలో ఉంచారు.

దోషులను హైదర్​ అలీ, నోమన్​ అన్సారీ, మహమ్మద్​ ముజిబుల్లా అన్సారీ, ఇమ్తియాజ్​ ఆలమ్​, అహ్మెద్​ హుస్సైన్​, ఫక్రుద్దిన్​ మహమ్మద్​, ఫిరోజ్​ అస్లామ్​, ఇమ్తియాజ్​ అన్సారీ, మహమ్మద్​ ఇఫ్తికర్​ ఆలమ్​, అజారుద్దిన్​ ఖురేషి, తౌఫిక్​ అన్సారీగా గుర్తించారు.

ఇదీ చూడండి:- యోగికి ఉగ్రవాదుల హెచ్చరిక.. '46 రైల్వే స్టేషన్లలో బాంబు పేలుళ్లు'!

Last Updated : Nov 1, 2021, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.