గుజరాత్ గోద్రాలో 2002లో జరిగిన రైలు దహనం కేసులో కీలక నిందితుడు రఫీక్ హుస్సేన్ భటుక్ను 19ఏళ్ల తర్వాత అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ కుట్రలో పాల్గొన్న ప్రధాన నిందితుల బృందంలో భటుక్ఉన్నట్లు పేర్కొన్నారు. గత 19 ఏళ్లుగా పరారీలో ఉన్న భటుక్ను గోద్రా పోలీసులు పక్కా ప్రణాళికతో.. గోద్రా రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఉన్న సిగ్నల్ ఫాలియా ప్రాంతంలో అరెస్టు చేసినట్లు పంచమహల్ జిల్లా ఎస్పీ లీనా పాటిల్ తెలిపారు.
"రైలు దహన కుట్రకు పాల్పడిన కోర్ గ్రూప్(ప్రధాన బృందం)లో భటుక్ ఉన్నాడు. రైలు బోగి తగలబెట్టడానికి పెట్రోల్ ఏర్పాటు చేసిన నిందితుల్లో ఒకడు. దర్యాప్తు సమయంలో అతని పేరు ఉన్నట్లు తెలిసిన వెంటనే దిల్లీకి పారిపోయాడు. బృందంలోని ఇతరులతో పాటు అతనూ హత్య, అల్లర్ల ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు."
- లీనా పాటిల్, పంచమహల్ జిల్లా ఎస్పీ
ఈ ఘటనకు సంబంధించి రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న సిగ్నల్ ఫాలియా ప్రాంతానికి చెందిన ఓ ముఠాపై గోద్రా రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పాటిల్ తెలిపారు. దీంతో గోద్రా నుంచి పారిపోయిన భటుక్.. రైల్వే స్టేషన్లలో, నిర్మాణ పనులు చేయడంతో పాటు గృహోపకరణాలను విక్రయిస్తూ.. ఎక్కువ కాలం దిల్లీలోనే గడిపాడని ఆమె తెలిపారు.
ఈ కేసులో మరో ముగ్గురు నిందితులైన సలీం ఇబ్రహీం బాదం, సలీం పన్వాలా, షౌకత్ చార్ఖా, అబ్దుల్‌మాజిద్ యూసుఫ్ మితా పాకిస్థాన్‌కు పారిపోయారని భావిస్తున్నట్లు పాటిల్ చెప్పారు.
31 మంది దోషులు...
ఫిబ్రవరి 27, 2002న సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులోని రెండు బోగీలు మంటల్లో కాలిపోయి 59 మంది మరణించారు. మార్చి 1, 2011న ప్రత్యేక కోర్టు 31 మందిని దోషులుగా తేల్చింది. అనంతరం 11 మందికి మరణశిక్ష, మరో 20 మందికి జీవిత ఖైదు విధించింది.
11 మందికి విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ 2017అక్టోబర్‌లో గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది. గతేడాది ఆగస్టులో ఫరూఖ్ భనా, ఇమ్రాన్ షెరిలకు జీవిత ఖైదు విధిస్తూ సిట్ కోర్టు తీర్పునిచ్చింది. మరో ముగ్గురిని నిర్ధోషులుగా విడుదల చేసింది.
ఇదీ చూడండి: లోయలో వాహనం పడి ఆరుగురు మృతి