ప్రభుత్వం నిషేధించిన వివిధ సంస్థలకు చెందిన 20 మంది తీవ్రవాదులు ఆయుధాలతో సహా మణిపుర్ సీఎం ఎన్. బీరేన్ సింగ్ ముందు లొంగిపోయారు. అందులో థాడో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(టీపీఎల్ఏ) 16మంది, యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన వారు ఇద్దరు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వారు ఒకరు, పీఆర్ఈఏకే(పీఆర్ఓ)కు చెందిన వారు ఒకరు ఉన్నారు.
ఇలా తీవ్రవాదులు లొంగిపోవడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఇది భాజపా కూటమి ప్రభుత్వం సాధించిన మరో విజయం అని పేర్కొన్నారు.
లొంగిపోయిన వారికి తలో రూ.4లక్షలు ఇస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. పునరావాస కేంద్రంలో ఉన్న మూడు సంవత్సరాలు నెలకు రూ.4000 ఉపకార వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. వారికి ఉద్యోగ నైపుణ్య శిక్షణను అందిస్తామన్నారు. వారి అభివృద్ధికోసం ప్రభుత్వం పాటు పడుతుందని హామీ ఇచ్చారు. మిగతా తీవ్రవాదులు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు బీరేన్ సింగ్.
ఇదీ చూడండి: దేశంలో అత్యత్తుమ ఠాణాగా 'మణిపుర్-నాంగ్పోక్షికమై'