ఛత్తీస్గఢ్లో సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా మందుపాతర పేల్చారు మావోయిస్టులు. ఈ పేలుడులో కోబ్రా అసిస్టెంట్ కమాండెంట్ నితిన్ భలేరావు మృతి చెందారు. ఐఈడీ పేలుడులో మరో 9 మంది కోబ్రా సిబ్బందికి గాయాలయ్యాయి.
సుక్మా జిల్లా తాడ్‌మెట్లలో నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్ చేపట్టాయి బలగాలు. ఆ సమయంలో తాడ్‌మెట్ల సమీపంలోని అటవీప్రాంతంలో బలగాలపై ఐఈడీ దాడి చేశారు మావోయిస్టులు.