ETV Bharat / bharat

దక్షిణాఫ్రికా నుంచి భారత్​కు వచ్చిన ఆ ఇద్దరికి కరోనా - బెంగళూరులో ఒమిక్రాన్​ వేరియంట్

omicron variant news: ఒమిక్రాన్​ వైరస్​ వేరియంట్​ను దక్షిణాఫ్రికాలో తొలుత గుర్తించారు. ఇది ఇతర దేశాలకు వ్యాపించినట్టు అనుమానాలు ఉన్నాయి. ఈ తరుణంలో.. దక్షిణాఫ్రికా నుంచి భారత్​కు వచ్చిన ఇద్దరికి వైరస్​ నిర్ధరణ (coronavirus bangalore) అయిన వార్త కలకలం సృష్టిస్తోంది. అయితే తదుపరి పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ఆ ఇద్దరికి ఒమిక్రాన్​ సోకలేదని తేలింది.

omicron variant news
కరోనా
author img

By

Published : Nov 27, 2021, 8:07 PM IST

Updated : Nov 28, 2021, 3:05 PM IST

omicron variant news: దక్షిణాఫ్రికా నుంచి భారత్​ వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్​ సోకినట్టు (coronavirus bangalore) తేలింది. ఆ దేశంలో తొలిసారి గుర్తించిన ఒమిక్రాన్​ వైరస్​ వేరియంట్​.. ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న తరుణం.. ఈ వార్త ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఆ ఇద్దరు బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. పరీక్షలు నిర్వహించగా.. ఆ ఇద్దరికి సోకింది ఒమిక్రాన్​ కాదని.. డెల్టా వేరియంట్​ అని తేలింది.

"ఈ నెల 1 నుంచి 26వరకు మొత్తం మీద 584 మంది వైరస్​ తీవ్రత ఎక్కువగా ఉన్న 10 దేశాల నుంచి బెంగళూరుకు వచ్చారు. వారిలో 94మంది దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. వాళ్లకి పరీక్షలు జరపగా.. కేవలం ఇద్దరికే వైరస్​ నిర్ధరణ అయ్యింది. తదుపరి పరీక్షల కోసం వారి రక్తనమూనాలను ల్యాబ్​కు పంపించాము. పరీక్షల్లో వారికి డెల్టా వైరస్​ సోకిందని తేలింది," అని బెంగళూరు రూరల్​ డిప్యూటీ కమిషనర్​ కే. శ్రీనివాస్​ వెల్లడించారు.

ప్రస్తుతం ఆ ఇద్దరు క్వారంటైన్​లో ఉన్నట్టు, వారిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు శ్రీనివాస్​ తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Last Updated : Nov 28, 2021, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.