భారత నావికాదళంలోని(Indian Navy news) జలాంతర్గాములకు(Submarine Data Leaked) సంబంధించిన కీలక రహస్యాల లీక్ కేసులో ఆరుగురిపై సీబీఐ(CBI News) ఛార్జిషీట్ దాఖలు చేసింది. సర్వీసులో ఉన్న ఇద్దరు కమాండర్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. నావికా దళానికి చెందిన కిలో క్లాస్ జలాంతర్గములకు చెందిన సమాచారం బయట వ్యక్తులకు అందజేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ సబ్‌మెరైన్లలోని ఎంఆర్‌సీఎల్ ప్రోగ్రాం వివరాలను లీక్ చేసినట్లు(Submarine Data Leaked) సీబీఐ పేర్కొంది. సర్వీసులో ఉన్న అధికారులు కీలక సమాచారాన్ని విశ్రాంత అధికారులకు అందజేశారు. ఆ విశ్రాంత అధికారులు దక్షిణ కొరియా కంపెనీ కోసం పనిచేస్తున్నారు. తాజాగా భారత నావికాదళం సరికొత్త జలాంతర్గాములను నిర్మించే ప్రాజెక్టును చేపట్టింది. దీనిలో కాంట్రాక్టు కోసం దక్షిణ కొరియా కంపెనీ కూడా ప్రయత్నిస్తోంది.
సెప్టెంబర్ 3న విశ్రాంత నేవీ అధికారులు రణదీప్ సింగ్, ఎస్‌జే సింగ్‌లను అరెస్టు చేయడం వల్ల అసలు విషయం బయటపడింది. వీరిలో కొమోడోర్ రణ్‌దీప్‌సింగ్ ఇంట్లో తనిఖీలు నిర్వహించి రూ.2 కోట్ల నగదును సీబీఐ స్వాధీనం చేసుకొంది. ఆ తర్వాత నావికాదళ పశ్చిమ కమాండ్‌లోని కమాండర్ అజిత్ కుమార్ పాండేను అరెస్టు చేశారు. దాదాపు డజను మందికి ఈ కేసుతో(Submarine Data Leaked) సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఇవీ చూడండి:
చైనా సరిహద్దుకు అమెరికన్ ఆయుధ వ్యవస్థలు
సబ్మెరైన్ల రహస్య డేటా లీక్.. ముగ్గురు నేవీ అధికారులు అరెస్ట్!