1971 ఇండియా-పాక్ యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న 'స్వర్ణిమ్ విజయ్ వర్ష్' కార్యక్రమం బెంగళూరులో జరిగింది. ఈ మేరకు 'విజయజ్వాల' శనివారం కర్ణాటకకు చేరుకుంది. గతేడాది డిసెంబర్ 16న దిల్లీలో జరిగిన జాతీయ యుద్ధ స్మారకం(ఎన్డబ్ల్యూఎం) వద్ద ప్రధాని వెలిగించిన 'విజయోత్సవ జ్వాల' బెంగళూరుకు చేరింది.
యుద్ధవీరుల మట్టి..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ వైమానిక దళాధిపతి మార్షల్ ఫాలి హోమి మేజర్ యుద్ధ వీరుల కుటుంబాలకు స్మారక చిహ్నాలను అందజేశారు. నాటి యుద్ధంలో పాల్గొన్న సైనికుల జ్ఞాపకార్థంగా వారి నివాసాల నుంచి మట్టిని సేకరించారు. దీనిని నేషనల్ వార్ మెమోరియల్లో చెట్లు పెంచేందుకు ఉపయోగించనున్నారు.
ఎయిర్ మార్షల్ హెచ్.బీ.రాజారామ్, ఎయిర్ మార్షల్ ఎస్పీ సింగ్, ఎయిర్ వైస్ మార్షల్ పీజే వాలియా సహా.. వాయుసేనలో సేవలందించిన విశిష్ట అనుభవజ్ఞులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భారత్- బంగ్లా దౌత్య సంబంధాలకు 50ఏళ్లు