ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో 18 శాతం మంది నేరచరితులేనని ప్రజాస్వామ్య సంస్కరణల కూటమి (ఏడీఆర్) తెలిపింది. ఈ మేరకు సదరు నేతలు తమ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు వెల్లడించింది. వచ్చిన 6,792 అఫిడవిట్లలో 6,318 పత్రాలను పరిశీలించి.. ఈ వివరాలు గుర్తించినట్లు చెప్పింది.
ఈ 6,318 మందిలో 1,157 మంది తమపై క్రిమినల్ అభియోగాలు ఉన్నట్లు వెల్లడించారని ఏడీఆర్ పేర్కొంది. 632 మందిపై తీవ్రమైన నేరాభియోగాలున్నాయి. బంగాల్లో మూడో దశ వరకు పరిశీలిస్తే అత్యధికంగా 144 మంది నేరచరిత్ర ఉన్నవాళ్లే. తమిళనాడులో 466 మంది, కేరళలో 355 మంది, అసోంలో 138 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ వివరించింది. ఈ 5 రాష్ట్రాల్లో పోటీలో ఉన్న వారిలో 1,317 మంది కోటీశ్వరులు ఉన్నారు.
ఇదీ చదవండి : 'బంగాల్లో భాజపా గాలి- 200+ సీట్లు మావే'