2016-20 మధ్య ఎన్నికలు జరిగిన సమయాల్లో ఏకంగా 170 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సొంత పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరినట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇదే సమయంలో భాజపాను వీడిన శాసనసభ్యుల సంఖ్య 18 మాత్రమేనని వెల్లడైంది.
2016-2020 మధ్య ఎన్నికల సమయాల్లో పార్టీలు మారి, తిరిగి పోటీ చేసిన 433 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రమాణపత్రాలు విశ్లేషించి ఈమేరకు నివేదిక రూపొందించింది అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్). వీరిలో 405 మంది ఎమ్మెల్యేలు తెలిపింది. ఇందులో అత్యధికంగా 182 మంది భాజపాలో చేరగా... ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి 38 మంది, తెరాసలోకి 25 మంది ఎమ్మెల్యేలు వెళ్లారని పేర్కొంది.
ఎన్నికల ముందు 16 మంది రాజ్యసభ సభ్యుల్లో 10మంది భాజపాలో చేరారని వెల్లడించింది. 12 మంది లోక్సభ సభ్యుల్లో ఐదుగురు కాంగ్రెస్లోకి వెళ్లినట్లు తెలిపింది.
ఇదీ చూడండి: కాంగ్రెస్కు సీనియర్ నేత చాకో రాజీనామా