ETV Bharat / bharat

అత్యాచారానికి గురైన ఆ 17 ఏళ్ల బాలిక మృతి - ఉత్తర్​ప్రదేశ్​ బాలిక అత్యాచారం

ఉత్తర్​ప్రదేశ్​ హమీర్​పుర్​లో రెండు రోజుల కిందట సామూహిక అత్యాచారానికి గురైన బాలిక మరణించింది. మరో ఘటనలో 11ఏళ్ల బాలికపై సమీప బంధువు అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

17-year-old girl dies two days after being gang-raped in UP's Hamirpur
17ఏళ్ల అత్యాచార బాలిక మృతి
author img

By

Published : Feb 24, 2021, 10:25 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ హమీర్​పుర్​లో రెండు రోజుల కిందట సామూహిక అత్యాచారానికి గురైన బాలిక చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికంగా ఉన్న మౌదాహా ప్రాంతంలో చికిత్స పొందుతుండగా.. ఆమె పరిస్థితి క్షీణించిందని అక్కడి ఎస్పీ నరేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. మెరుగైన చికిత్స కోసం బాధితురాలని వేరే ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించినట్లు పేర్కొన్నారు.

బాధితురాలి కుటుంబం.. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని అధికారులు తెలిపారు. అయితే.. తన కుమార్తెపై సోమవారం రాత్రి అయిదుగురు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. భయపడి.. పోలీసులకు ఫిర్యాదు చేయలేదని అన్నారు.

11ఏళ్ల బాలికపై..

ఉత్తర్​ప్రదేశ్​లోని బాందాలో 11ఏళ్ల బాలికపై సమీప బంధువే అత్యాచారానికి ఒడిగట్టాడు. సోమవారం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదైంది. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిద్రమత్తులో ఉన్న బాలికను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: మూడేళ్ల బాలికపై 22 ఏళ్ల యువకుడి అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.