17 Patients Died in Single Night in Hospital : మహారాష్ట్ర.. ఠాణే జిల్లా కల్వాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో ఒక్కరాత్రిలో 17 మంది రోగులు మృతి చెందారు. శనివారం రాత్రి 10.30 నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల మధ్యలో ఈ మరణాలు సంభవించాయి. అందులో 12 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నవారు కాగా.. మరో ఐదుగురు ఇతర వార్డుల్లో వైద్యం తీసుకుంటున్నారు.
ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం వల్ల.. ఆసుపత్రిలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. మృతుల సంఖ్యను ఆసుపత్రి వర్గాలు కూడా ధ్రువీకరించాయి. రోగుల తాకిడికి అనుగుణంగా వైద్యులు లేకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 10న కూడా ఇదే ఆసుపత్రిలో ఒక్క రోజులోనే ఐదుగురు చనిపోయారు. అప్పుడు స్థానిక నాయకులు ఇక్కడ ఆందోళన సైతం చేపట్టారు.
"చనిపోయిన వారిలో కొంత మంది రోగులు ప్రైవేటు ఆసుపత్రి నుంచి వచ్చారు. చివరి క్షణంలో వీరు ఆసుపత్రికి రావడం వల్ల ఏం చేయలేకపోయాం. మరికొంత మంది 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఉన్నారు. ఈ మధ్యే ఠాణే సివిల్ ఆసుపత్రి మూసివేశారు. దీంతో ఎక్కువ మంది రోగులు ఇక్కడికే వస్తున్నారు." అని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఆస్పత్రిలో సరైన సదుపాయలు లేకపోవడం, వైద్యుల కొరత ఉండటం వల్ల.. ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని వారు వాపోయారు.
ఆక్సిజన్ మాస్క్‌కు బదులుగా టీ కప్.. అనారోగ్యంతో వచ్చిన బాలుడికి వైద్య సిబ్బంది నిర్వాకం..
Tea Cup Oxygen Mask : పది రోజుల క్రితం ఆసుపత్రిలో ఆక్సిజన్ మాస్క్‌ల కొరత కారణంగా.. ఓ బాలుడికి టీ కప్ గుండా కృత్రిమ శ్వాసను అందించారు వైద్యులు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న బాలుడికి.. ఆక్సిజన్ మాస్క్‌కు బదులుగా టీ కప్ అమర్చారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లా.. ఉత్తరమేరూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. ఈ సన్నివేశాన్ని మొత్తం వీడియో తీసిన ఓ వ్యక్తి.. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పెళ్లికి వెళ్తూ ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి.. మరో ప్రమాదంలో నలుగురు
పొలంలో 14అడుగుల కింగ్ కోబ్రా.. ఏడాదిగా వ్యవసాయం బంద్!.. చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్