మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరటి గెలల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడి 15 మంది కూలీలు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ధులే నుంచి రావెర్ ప్రాంతానికి అరటి లోడ్‌తో వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ట్రక్కులో 21 మంది కూలీలు ఉన్నారు. వారంతా రావెర్ తాలూకలోని కెహాలా గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.