ETV Bharat / bharat

'ఆ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు'

author img

By

Published : Jun 9, 2021, 6:08 PM IST

కరోనా కష్టకాలంలో సతమతం అవుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త ఊరటనిచ్చేలా మోదీ సర్కార్​ కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యులు లేక ఉద్యోగులు కానీ కరోనా బారిన పడితే ప్రత్యేక సెలవులను మంజూరు చేయనున్నట్లు తెలిపింది.

Centre govt
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు

కుటుంబ సభ్యులు ఎవరైనా కరోనా బారిన పడితే ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల ప్రత్యేక సెలవు మంజూరు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. వీటిని ప్రత్యేక సెలవు దినాలుగా(స్పెషల్​ క్యాజువల్​ లీవ్​) పరిగణిస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సిబ్బంది వ్యవహారాల శాఖ జారీ చేసింది.

ప్రత్యేక సెలవు దినాలు ముగిసిన తరువాత కూడా కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే... ఈ ఉద్యోగులకు వారు డిశ్చార్జ్​ అయ్యే వరకు సెలవులు ఇచ్చేందుకు అనుమతించాలని సంబంధిత విభాగాలకు సూచించింది కేంద్రం.

కరోనా మహమ్మారి చికిత్సా సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఉత్తర్వులను జారీ చేసినట్లు తెలిపింది. ఉద్యోగికే కరోనా సోకితే హోం ఐసోలేషన్​లో ఉండేందుకు 20 రోజుల వరకు సెలవులు ఇస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ సెలవులు ఉద్యోగికి పాజిటివ్​గా నిర్ధరణ అయిన నాటి నుంచి ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: ఈసీ​గా బాధ్యతలు స్వీకరించిన అనూప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.