ETV Bharat / bharat

'ఆ జిల్లాల్లో 15% పైగా పాజిటివిటి రేటు' - కరోనా రెండో దశ

రెండో దశ కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. మహమ్మారి బారిన పడిన రోగులు, దాని తీవ్రతకు సంబంధించిన పలు అంశాలతో కూడిన సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 146 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 15 శాతానికి పైగా ఉండగా.. 274 జిల్లాల్లో 5-15 శాతం మధ్య కేసులు నమోదవుతున్నట్లు తెలిపింది.

VIRUS
కరోనా వైరస్
author img

By

Published : Apr 21, 2021, 8:10 PM IST

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ, వివిధ రాష్ట్రాల్లోని 146జిల్లాల్లో 15శాతం పైగా పాజిటివిటి రేటు నమోదవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 274 జిల్లాల్లో అది 5 నుంచి 15 శాతంగా ఉంటున్నట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషన్‌ తెలిపారు. గతేడాది పదేళ్లలోపు వయసున్న వారిలో 4.03శాతం మంది కరోనా బారిన పడగా ప్రస్తుతం అది 2.97శాతానికి తగ్గినట్లు కేంద్రం పేర్కొంది.

మొదటి దశ‌లో 10 నుంచి 20ఏళ్ల మధ్య ఉన్న వారు 8.07శాతం మంది వైరస్‌ ప్రభావానికి గురికాగా.. సెకండ్‌ వేవ్‌లో అది 8.50శాతానికి పెరిగినట్లు తెలిపింది. అదే విధంగా.. 20 నుంచి 30ఏళ్ల మధ్య ఉన్న వారు మొదట 20.41శాతం వైరస్‌ బారిన పడగా.. సెకండ్‌ వేవ్‌లో 19.35శాతం కరోనా కాటుకు గురవుతున్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. ఇక.. 30నుంచి ఆపై వయసున్న వారు తొలిదశలో 67.5శాతం వైరస్‌ బారిన పడగా.. ప్రస్తుతం అది 69.18శాతానికి పెరిగినట్లు పేర్కొంది.

ఇవీ చదవండి: కరోనా వైరస్​పై 'కొవాగ్జిన్​' 78 శాతం ప్రభావవంతం

ఆ నాలుగు రాష్ట్రాల్లో.. అందరికీ టీకా ఉచితంగానే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.