దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. 20 వేలలోపే కొత్త కేసులు నమోదవుతుండటం ఊరట కలిగించే విషయం. కొత్తగా 14,256 కేసులు నమోదయ్యాయి. మరో 152 మంది ప్రాణాలు కోల్పోయారు. 17,130 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13,90,592 మంది వైద్యసిబ్బందికి టీకాలు అందించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు: 1,06,39,684
- క్రియాశీల కేసులు: 1,85,662
- కోలుకున్నవారు: 10,300,838
- మరణాలు: 1,53,184
నిర్ధరణ పరీక్షలు
దేశంలో శుక్రవారం ఒక్కరోజే 8,37,095 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. జనవరి 22 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం పరీక్షల సంఖ్య 19,09,85,119కు చేరింది.
ఇదీ చదవండి : కరోనాపై యుద్ధం: 12.7 లక్షల మందికి టీకా