ETV Bharat / bharat

'దహీ కచోరి'తో రాత్రికి రాత్రే 14 ఏళ్ల బాలుడు ఫేమస్ - దహీ కచోరీ వైరల్​

రోడ్డు పక్కన బైక్​పై టిఫిన్స్​ విక్రయిస్తున్న వారు చాలా మందే కనిపిస్తారు. అలా.. ద్విచక్రవాహనంపై 'దహీ కచోరీ'లు(Dahi Kachori news) విక్రయిస్తున్న ఓ 14 ఏళ్ల బాలుడు రాత్రికి రాత్రే పాపులర్​గా మారిపోయాడు. ఎలాగంటారా.. అదంతా సోషల్​ మీడియా పుణ్యమే మరి.

Dahi Kachoris
రాత్రికి రాత్రే పాపులర్​గా మారిన 14 ఏళ్ల బాలుడు!
author img

By

Published : Oct 4, 2021, 10:21 AM IST

రాత్రికి రాత్రే పాపులర్​గా మారిన 14 ఏళ్ల బాలుడు

తమ ఉత్పత్తులు, చేసే పనులకు ప్రచారం కల్పించుకోలేని వారికి సామాజిక మాధ్యమాలు ఒక వరంలా మారుతున్నాయి. చాలా మంది స్నాక్స్​, టిఫిన్స్​, భోజనం విక్రయించేవారు, గాయకులు, డ్యాన్సర్లు సోషల్​ మీడియా ద్వారా రాత్రికి రాత్రే పాపులర్​గా మారిన సంఘటనలు చూశాం. కొద్ది రోజుల క్రితం దిల్లీకి చెందిన 'బాబాకా దాబా' వైరల్(Baba ka Daba)​గా మారినట్లుగానే.. అహ్మదాబాద్​లోని మనీనగర్​కు చెందిన ఓ బాలుడు విక్రయిస్తున్న 'దహీ కచోరీ'(Dahi Kachori news) పాపులర్​ అయింది.

మనీనగర్​కు చెందిన తన్మయ్​ అగర్వాల్​(14).. అహ్మదాబాద్​ రైల్వేస్టేషన్​ సమీపంలో ద్విచక్ర వాహనంపై రూ.10కి దహీ కచోరీ విక్రయిస్తుంటాడు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు​. ఆ బాలుడి పనిని ఓ యువకుడు వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయగా.. అది కాస్త వైరల్​గా మారింది. ఆ తర్వాతి రోజు నుంచే దహీ కచోరీ తినేందుకు తన్మయ్​ బండి వద్ద జనం తాకిడి పెరిగింది.

" ఓ యువకుడు నా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశాడు. అది వైరల్​గా మారింది. ఆ తర్వాతి రోజు నుంచే కస్టమర్లు పెరగటం గమనించాను. మా నాన్న, అమ్మ, చెల్లి, నానమ్మ కచోరీలు తయారు చేస్తారు. ఉమ్మడి కుటుంబంలో కలహాలతో మేము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కుటుంబానికి సాయంగా ఉండేందుకే కచోరీలు విక్రయిస్తున్నా. "

- తన్మయ్​ అగర్వాల్​.

తన్మయ్​ దహీ కచోరీలు తినేందుకు కస్టమర్లు పెరగటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు అతని కుటుంబ సభ్యులు. బండి వద్ద దహీ కచోరీలు తిన్న తర్వాత తన్మయ్​తో సెల్ఫీలు దిగుతున్నారు పలువురు.

ఇదీ చూడండి: సమోసాలపై సీరియల్​ నంబర్​.. ఇదేం విడ్డూరం గురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.