ETV Bharat / bharat

ప్రేమికుడితో వెళ్లిన బాలికకు గుండు కొట్టించి.. ఊరేగించి.. - అమాయక అమ్మాయికి శిక్ష

ఒక వ్యక్తితో కలిసి వెళ్లిపోయిందన్న నెపంతో పద్నాలుగేళ్ల బాలికను దారుణంగా శిక్షించారు గ్రామస్థులు. గుండుకొట్టించి.. ముఖానికి నలుపు రంగు పూసి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

GJ-GIRL-PUNISHMENT
గర్ల్
author img

By

Published : Nov 13, 2021, 4:05 PM IST

Updated : Nov 13, 2021, 4:38 PM IST

గుజరాత్‌ పటాన్ జిల్లాలో(pathan district news) దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందన్న కారణంతో 14 ఏళ్ల బాలికను గ్రామస్థలు చిత్రహింసలకు గురిచేశారు(gujarat crime news). బాలికకు గుండుకొట్టించి.. ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు. బాలికను ప్రేమించిన వ్యక్తిపైనా ఇదే విధంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

'బాలిక చర్యల వల్ల తమ తెగకు చెడ్డ పేరు వచ్చిందని.. ఆమెను 'శుద్ధి' చేసేందుకే ఈ శిక్ష విధించినట్లు,' "వాడి" తెగకు చెందిన గిరిజనులు(gujarat tribe) పేర్కొన్నారు. అనంతరం వారి వర్గానికి చెందిన మరో వ్యక్తికి బాలికను ఇచ్చి వివాహం జరిపించారు.

నవంబర్ 10న హారిజ్ గ్రామంలో జరిగిన ఈ ఘటన(gujarat crime rate) ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో 35మందిపై ఎఫ్​ఆర్​ నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు 22 మందిని అరెస్టు చేశారు. బాలిక ప్రేమించిన వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆమెను అపహరించి ఖేడా జిల్లాలోని డాకోర్​కు తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేశాడని అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 13, 2021, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.