ETV Bharat / bharat

హెయిర్​కట్ అలా చేసుకున్నాడని తండ్రి మందలింపు.. ఉరేసుకుని కొడుకు ఆత్మహత్య - విద్యార్థినిపై అత్యాచారం

స్టైలిష్​గా హెయిర్ కట్ చేసుకున్నాడని తండ్రి మందలించడం వల్ల ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బంగాల్​లో జరిగింది. మరోవైపు, ఓ విద్యార్థినికి మత్తుమందు కలిపిన ఆహారం ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు పాఠశాల ప్రిన్సిపల్‌. ఈ దారుణం ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Dec 11, 2022, 10:23 PM IST

స్టైలిష్​గా హెయిర్​ కట్ చేయించుకుని ఇంటికి వచ్చిన కుమారుడిని మందలించాడు ఓ తండ్రి. దీంతో మనస్తాపానికి గురైన కుమారుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన బంగాల్​లోని పశ్చిమ మేదినీపుర్​లో శుక్రవారం జరిగింది. మృతుడిని 8వ తరగతి చదువుతున్న బైజిత్​ పురియాగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
విద్యార్థులు ఇలా హెయిర్ కట్ చేసుకోవడం సరికాదని మృతుడి తండ్రి శ్యాంప్రసాద్ పురియా తిట్టాడు. దీంతో అవమానంగా భావించిన బైజిత్​.. తన ఇంటి రెండో అంతస్తులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిన్న విషయానికే బాలుడు ఆత్మహత్య చేసుకోవడం వల్ల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

విద్యార్థినిపై ప్రిన్సిపల్​..
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువే కీచకుడిలా మారాడు. తొమ్మిది మంది బాలికల్ని టూర్‌ పేరిట బయటకు తీసుకెళ్లి అక్కడే హోటల్‌లో ఓ విద్యార్థినికి మత్తుమందు కలిపిన ఆహారం ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఉదంతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మేరఠ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్‌ నవంబర్‌ 23న తొమ్మిది మంది విద్యార్థినులను టూర్‌ కోసం బృందావన్‌కు తీసుకెళ్లాడు. రాత్రిపూట బస చేసేందుకు ఓ హోటల్‌లో రెండు గదులను అద్దెకు తీసుకున్నాడు. ఎనిమిది మంది విద్యార్థినుల్ని ఒక గదిలో ఉంచగా.. మరో గదిలో 11వ తరగతి చదువుతున్న బాలిక (17)తో పాటు అతడు ఉన్నాడు. విద్యార్థిని తినే ఆహారంలో మత్తు మందు కలిపిన ప్రిన్సిపల్‌.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ క్రమంలో బాలిక ప్రతిఘటించడం వల్ల బెదిరింపులకు దిగాడు. ఎవరికైనా చెబితే పరీక్షల్లో ఫెయిల్‌ చేస్తాననడమే కాకుండా చంపేస్తానని కూడా బెదిరించినట్టు హస్తినాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ తెలిపారు. అయితే, విద్యార్థులంతా నవంబర్‌ 24న ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారన్నారు. బాధితురాలు తొలుత ఈ ఘటనపై మౌనంగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత తనపై జరిగిన ఈ దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.