ఒడిశాలో కరోనా మహమ్మారి చిన్నారుల(Covid in children)పై పంజా విసురుతోంది. కొత్తగా 887 కరోనా కేసులు(Odisha new COVID cases) వెలుగులోకి రాగా.. అందులో 131 మంది 18ఏళ్ల లోపు వారే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం కేసుల్లో చిన్నారుల శాతం 14.76గా నమోదైంది. క్రితం రోజు(12.8)తో పోలిస్తే ఇది 2శాతం అధికం.
ఆగస్టు 15 నుంచి చిన్నారుల కరోనా గణాంకాల(Children Covid data)ను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నమోదు చేస్తోంది. ఆ రోజు నుంచి ఇప్పటివరకు 1,260 మంది చిన్నారులకు కరోనా(COVID-19) పాజిటివ్‌గా తేలింది.
ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 10,03,210 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. 7562 మంది మరణించారు. 8226 యాక్టివ్ కేసులు ఉండగా.. 9,87,369 మంది రికవరీ అయ్యారు.
దేశంలో...
కాగా, దేశవ్యాప్తంగా భారీగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 37 వేల మందికి కొత్తగా కొవిడ్(India Covid cases) సోకింది. మరో 648 మంది మరణించగా... ఒక్కరోజే 34,169 మంది కరోనాను జయించారు.
ఇదీ చదవండి: