ETV Bharat / bharat

'దేశంలో 19 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ' - india administers 19 crores doses

కొవిడ్-19 వ్యాక్సిన్​ పంపిణీలో భారత్​ మరో మైలురాయి చేరుకుంది. గురువారం రాత్రి 8 గంటల వరకు.. 19 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. విదేశాల నుంచి ఇప్పటివరకు దేశానికి చేరిన వైద్య పరికరాల వివరాలను వెల్లడించింది.

covid vaccine
కొవిడ్ టీకా, వ్యాక్సిన్
author img

By

Published : May 21, 2021, 5:43 AM IST

దేశంలో కరోనా టీకా డోసుల పంపిణీ 19 కోట్ల మైలురాయి దాటింది. గురువారం రాత్రి 8 గంటల వరకు 19,18,10,604 డోసులు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఒక్కరోజే 14.56 లక్షలకు పైగా టీకా డోసులు అందజేసినట్లు వెల్లడించింది. ఇందులో 12,73,785 తొలి డోసులు కాగా.. 1,82,303 రెండో డోసులని తెలిపింది. 18- 44 మధ్య వయసుగల వారిలో.. గురువారం 7,36,514 మంది తొలి డోసు తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ వివరించింది.

విదేశాల సాయం..

కరోనా సంక్షోభంలో భారత్​కు అండగా నిలిచాయి వివిధ దేశాలు. ఏప్రిల్ 27 నుంచి మే 19 వరకు.. 13,093 ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు, 15,801 ఆక్సిజన్ సిలిండర్లు, 6.1లక్షల రెమ్​డెసివిర్​ ఔషధాలు ప్రపంచ దేశాల నుంచి భారత్​కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. భారత్​కు చేరుకున్న వైద్యపరికరాలను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

19 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లతో పాటు 10,425 వెంటిలేటర్లు భారత్​కు చేరుకున్నట్లు స్పష్టం చేసింది ఆరోగ్య శాఖ. మే 18-19న.. కెనడా, కువైట్, ఓమన్, మయన్మార్, యూకే దేశాల నుంచి ఎక్కువ మొత్తంలో వైద్య పరికరాలు అందినట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి:తమిళనాడులో తగ్గని కరోనా ఉద్ధృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.