ETV Bharat / bharat

విదేశీ సాయమంతా కేంద్ర సంస్థలకే!

కరోనాపై పోరులో భాగంగా.. భారత్​కు వివిధ దేశాలు అందిస్తున్న సాయాన్నంతా కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోని ఆసుపత్రులకే కేటాయించింది. ఫ్రాన్స్ నుంచి వచ్చిన రెండు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లనూ దిల్లీలోని రెండు ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయించింది. దీనిపై వైద్యనిపుణులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

foreign covid aid
విదేశీ సాయమంతా కేంద్ర సంస్థలకే
author img

By

Published : May 6, 2021, 5:52 AM IST

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న కరోనా తీవ్రత నుంచి ప్రజలను ఆదుకోవడానికి వివిధ దేశాలు అందిస్తున్న సాయాన్నంతా కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోని ఆసుపత్రులకే కేటాయించింది. ఇందులో రెండు మినహా మిగిలినవన్నీ కేంద్రం ఆధ్వర్యంలోని ఆసుపత్రులే ఉండటంపట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేదీ వరకు భారత్ కు యూకే, ఐర్లాండ్, రొమేనియా, రష్యా, యూఏఈ, అమెరికా, తైవాన్, కువైట్, ఫ్రాన్స్, థాయ్​లాండ్, జర్మనీ, ఉజ్బెకిస్థాన్, బెల్జియం, ఇటలీల నుంచి సుమారు 40 లక్షల పరికరాలు రాగా వాటిని దేశంలోని 31 రాష్ట్రాల్లో ఉన్న 38 సంస్థలకు కేటాయించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులో దిల్లీలోనే 8 ఉన్నాయి. దక్షిణాదిలో మూడు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులకు ఇవి అందాయి.

ప్రైవేటు ఆసుపత్రులకు..

ఫ్రాన్స్ నుంచి వచ్చిన రెండు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను దిల్లీలోని అత్యంత ఖరీదైన రెండు ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ ప్రాతిపదికన విదేశీ సాయాన్ని ఇలా ధారాదత్తం చేశారని వైద్యనిపుణులు ప్రశ్నిస్తున్నారు. విదేశీ వైద్య సాయాన్ని అందుకున్న రాష్ట్ర ఆసుపత్రుల్లో ఉత్తర్ ప్రదేశ్ లోని పిలీభీత్ జిల్లా ఆసుపత్రి, జైపుర్​లోని ప్రభుత్వ ఆసుపత్రి మాత్రమే ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఉన్న కేసుల తీవ్రత ఆధారంగా ఈ వస్తువులను పంపిణీ చేసినట్లు కేంద్రం పేర్కొంది.

ఆ లెక్కలు చెప్పలేదు..

కేంద్రానికి విదేశీ సాయంలో ప్రధానంగా 1,274 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 101 వెంటిలేటర్లు, 587 ఆక్సిజన్ సిలిండర్లు, 2 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, 1,53,708 రెమ్​డెసివిర్​లు, 33 మెడికల్ కేబినెట్లు ఉన్నాయి. ఏ సంస్థకు ఏయే వస్తువులు, ఎన్నెన్ని కేటాయించిందో కేంద్రం చెప్పలేదు. క్రియాశీల కేసులు, మరణాల రేటు, పాజివిటీ రేటు ఆధారంగా వీటిని పంపిణీ చేసినట్లు మాత్రమే పేర్కొంది. దీనివల్ల రాష్ట్రాల్లోని వైద్య సదుపాయాలు మెరుగుపడతాయని ఆభిప్రాయపడింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ విదేశీ సాయం ఏపీలోని మంగళగిరి, తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ కి పంపారు.

ఇదీ చూడండి: విదేశాల సాయం వివరాలెక్కడ?: రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.