రాజస్థాన్లోని బాంస్వాడాలో దారుణం జరిగింది. 12 ఏళ్ల బాలిక మగబిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాంశమైంది. విపరీతమైన కడుపునొప్పితో బాధపడిన బాలికను శనివారం రాత్రి జిల్లాలోని మహాత్మాగాంధీ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనపై బాంస్వాడా పోలీసులకు ఫిర్యాదు చేసింది శిశు సంక్షేమ కమిటీ. ప్రస్తుతం బాధితురాలు ప్రస్తుతం 9వ తరగతి చదువుతోందని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికను ఆసుపత్రికి తీసుకువచ్చిన తర్వాత వైద్యులు పలురకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలిక 33 వారాల గర్భిణీ అని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆపరేషన్ నిర్వహించగా బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, శిశు సంక్షేమ కమిటీ అధ్యక్షుడు దిలీప్ రోక్జా ఆసుపత్రికి చేరుకున్నారు.
బాధితురాలికి అండగా ఉంటామని, నిందితుడికి వ్యతిరేకంగా పోరాడతామని శిశు సంక్షేమ కమిటీ అధ్యక్షుడు దిలీప్ తెలిపారు. నిందితుడు ఖమెరాకు చెందిన వాడని, అతడి పేరు విజయ్ అని బాధితురాలు చెప్పిందని ఆయన వెల్లడించారు.
మరోవైపు.. బాలిక కుటుంబ సభ్యులు చిన్నారిని ఇంటికి తీసుకెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో ప్రస్తుతం నవజాత శిశువు.. శిశు సంక్షేమ కమిటీ పర్యవేక్షణలో ఉందని పోలీసులు తెలిపారు. బాలికను మహిళా పోలీసు సిబ్బంది, నిపుణులు విచారిస్తారని.. అవసరమైతే కౌన్సిలింగ్ కూడా ఇస్తామని చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడ్ని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నామని తెలిపారు.
ఇవీ చదవండి: సాయం పేరిట మోసం, వ్యభిచార కూపంలోకి దింపి సామూహిక అత్యాచారం
హ్యాట్రిక్ కోసం భాజపా పక్కా గేమ్ ప్లాన్, అందుకే ఆయనకు నో, ఈయనకు ఎస్