కేరళలో రోజువారీ కరోనా కేసుల సంఖ్యలో తగ్గుదల నమోదైంది. అయితే మరణాల సంఖ్య పెరిగింది. తాజాగా 11,586 మందికి వైరస్ సోకింది. ఫలితంగా మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 32 లక్షల 83 వేలు దాటింది. మరో 135 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 16,170కు చేరింది. కాగా కొత్తగా 14,912 మంది కోలుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీనా జార్జ్ తెలిపారు.
51కు చేరిన జికా
రాష్ట్రంలో మరోవైపు జికా వైరస్ బాధితుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. కొత్తగా మరో ముగ్గురుకి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: ఏడు గంటల పాటు బస్సుపైనే మేనేజర్- ఎందుకంటే..