ETV Bharat / bharat

ఆర్మీ దుస్తుల్లో సంచరిస్తున్న 11మంది అరెస్టు - అసోం వార్తలు

అధికారిక గుర్తింపు లేకుండా ఆర్మీ యూనిఫామ్​తో తిరుగుతున్న 11 మందిని అరెస్ట్​ చేశారు పోలీసులు. అసోంలోని గువాహటి విమానాశ్రయం సమీపంలో గస్తీ కాస్తున్న పోలీసులకు వారు పట్టుబడ్డారు. నిందితులపై క్రిమినల్​, ప్రభుత్వ స్టాంపుల ఫోర్జరీ వంటి పలు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

11 MEMBERS OF FAKE ARMY PERSONNEL NABBED NEAR GUWAHATI AIRPORT
ఆర్మీ దుస్తుల్లో సంచరిస్తున్న 11మంది అరెస్టు
author img

By

Published : Nov 18, 2020, 5:34 AM IST

సైనికులని ధ్రువీకరించే ఎలాంటి అధికారిక గుర్తింపు పత్రం లేకుండా సంచరిస్తున్న 11మందిని అరెస్టు చేశారు పోలీసులు. అసోంలోని గువాహటిలో లోకప్రియ గోపీనాథ్‌ బర్దోలీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులకు నలుగురు వ్యక్తులు ఆర్మీ దుస్తులు ధరించి అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు ఆరా తీయగా.. వారు సైనిక సిబ్బంది కాదని అర్థమైంది. దీనికితోడు వారిచ్చిన సమాచారంతో.. ఆర్మీ దుస్తుల్లో తిరుగుతున్న మరో ఏడుగురినీ అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో భాగంగా పోలీసుల అదుపులో ఉన్న గోస్వామి.. మిగతా 10మందికి ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులుగా అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చినట్లు తేలింది. వారితో పాటు గోస్వామి కూడా సెక్యూరిటీ అధికారిగా చలామణి అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అదుపులో ఉన్న 11 మంది ఇళ్లలో తనిఖీలు చేసిన పోలీసులు.. పలు రకాల డాక్యుమెంట్లు, ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులపై క్రిమినల్ కేసులతో పాటు ప్రభుత్వ స్టాంపుల ఫోర్జరీకి సంబంధించి పలు కేసులను నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వారి నుంచి పూర్తి వివరాలు రాబెట్టేందుకు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: 50మంది పిల్లలపై లైంగిక దాడి - ప్రభుత్వ ఇంజినీర్ అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.