Covid Cases In India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 1,007 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 43,039,023కు చేరింది. వైరస్ ధాటికి ఒకరు మాత్రమే చనిపోయారు. 818 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.76 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసులు 11,058 ఉన్నాయి.
• యాక్టివ్ కేసులు: 11,058
• మరణాలు: 5,21,737
• మొత్తం కేసులు: 43,039,023
• రికవరీలు: 4,25,06,228
Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 14,48,876 మందికి బుధవారం టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,86,22,76,304కు చేరింది. కొత్తగా 434,877 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 795,389,402 కరోనా పరీక్షలు చేశారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా 978,703 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 2749 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
- దక్షిణ కొరియాలో తాజాగా 1,95,370 కరోనా కేసులు నమోదయ్యాయి. 184 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో 1,79,888 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 307 మంది మృతిచెందారు.
- ఫ్రాన్స్‌లో తాజాగా 1,46,426 మంది వైరస్ సోకింది. మరో 152 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఆస్ట్రేలియాలో 53,380 కరోనా కేసులు బయటపడ్డాయి. 39 మంది వైరస్‌కు బలయ్యారు.
- ఇటలీలో 62,037 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 155 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: హక్కులే సర్వస్వం.. సమన్యాయం కోసం అలుపెరగని పోరాటం