రాజస్థాన్ చురు జిల్లాలో కలుషిత ఆహారం తిని(Food Poisoining in churu) 100 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 45 మంది చిన్నారులు కూడా ఉన్నారు. బుధవారం ఓ వివాహ వేడుకలో ఆహారం తీసుకున్న తర్వాత వీరంతా అనారోగ్యం బారిన పడ్డారు.
బాధితులందరినీ చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పడకల కొరతతో కొంతమందికి నేలపై పడుకోబెట్టి చికిత్స అందించారు.
నాలుగు పెళ్లిళ్లు...
సర్దార్షహర్ ప్రాంతంలో ఈ వివాహం జరిగినట్లు సమాచారం. నలుగురు కుమార్తెలకు ఒకే రోజు వివాహం జరిపించిన ఓ వ్యక్తి.. ఘనంగా విందు ఏర్పాట్లు చేయించారు. ఇక్కడ భోజనం చేసిన వారికి.. సుమారు నాలుగు గంటల తర్వాత కడుపునొప్పి, డయేరియా వంటి లక్షణాలు కనిపించాయి. కొంతమందిలో తీవ్రత అధికమైంది. దీంతో ఆటోలు, మినీ బస్సుల్లో బాధితులను ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆస్పత్రి వద్ద రద్దీ ఎక్కువైంది.
ఇదీ చదవండి: దేశంలో కొత్తగా 47వేల మందికి కరోనా