ETV Bharat / bharat

బంగారానికి దారి చూపిన ఎలుక.. ఆ ఫ్యామిలీ ఫుల్​ ఖుష్! - పోలీసులకు ఎలుక సాయం

లక్షలు విలువైన బంగారు ఆభరణాలు పట్టుకునేందుకు ఓ ఎలుక పోలీసులకు దారి చూపింది. చెత్తకుప్పలోని 100 గ్రాముల బంగారాన్ని పట్టించింది. ఈ సంఘటన మహారాష్ట్ర, ముంబయిలోని దిండోశీ ప్రాంతంలో జరిగింది. చెత్తకుప్పలో అంత బంగారం ఎక్కడిది? ఆ ఎలుక చేసిన సాయం ఏమిటి?

100 gm of gold seized from garbage
చెత్తకుప్పలో 100 గ్రాముల బంగారం
author img

By

Published : Jun 16, 2022, 3:28 PM IST

చెత్తకుప్పలో నుంచి 100 గ్రాముల బంగారు ఆభరణాల ఓ ఎలుక సాయంతో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని దిండోశీ ప్రాంతంలో జరిగింది. చివరకు బంగారు ఆభరణాలను యజమానులకు అప్పగించారు. ఇంతకీ ఆ చెత్తకుప్పలోకి బంగారు ఆభరణాలు ఎలా వెళ్లాయి?

ఏం జరిగిందంటే?: దిండోశీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఆరే కాలనీకి చెందిన సుందరి అనే మహిళ.. తన కుమార్తె వివాహం కోసం రుణం తీసుకునేందుకు 100 గ్రాముల బంగారు ఆభరణాలతో బ్యాంకుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యాచకురాలు, ఆమె కుమారుడు కనిపించారు. ఓ కవర్​లో ఉన్న వడాపావ్​ను ఆ బాలుడికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు సుందరి. తీరా బ్యాంకుకు వెళ్లి చూసుకోగా.. వడాపావ్​ ఇచ్చిన బ్యాగ్​లోనే బంగారం ఉన్నట్లు గుర్తించారు. హుటాహుటిన ఆ యాచకురాలు కనిపించిన ప్రాంతానికి వెళ్లారు. కానీ, వారు అక్కడ లేకపోవటం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

100 gm of gold seized from garbage
ఆటోలోంచి చెత్తకుప్పలో పడేస్తున్న బ్యాగు

కేసు నమోదు చేసుకున్న దిండోశీ పోలీస్​ స్టేషన్​ ఇంఛార్జ్​ సూరజ్​ రౌత్​ తనిఖీలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఆ యచకురాలు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆమెను పట్టుకుని విచారించగా.. వడాపావ్​ ఎండిపోయిందనుకుని సుందరి ఇచ్చిన కవర్​ను చెత్తకుప్పలో పడెసినట్లు తెలిపింది. అయితే.. చెత్తకుప్పలో వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. బంగారం ఉన్న బ్యాగ్​ కనిపించలేదు.

చెత్తకుప్ప సమీపంలోని సీసీటీవీ కెమెరాలను క్షణ్నంగా పరిశీలించారు పోలీసులు. ఓ ఎలుక ఆ బ్యాగ్​ను పట్టుకుని ఉన్నట్లు గుర్తించారు. దానిని పట్టుకునేందుకు వెంబడించారు. బంగారం సంచిని తీసుకుని సమీపంలోని మురికి కాలువలోకి వెళ్లింది మూషికం. కాలువలోంచి బంగారం ఉన్న బ్యాగ్​ను స్వాధీనం చేసుకుని స్టేషన్​కు తీసుకెళ్లారు. అనంతరం సుందరి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Gold in Garbage
ఆభరణాలను సుందరికి అప్పగిస్తున్న పోలీసులు

ఇదీ చూడండి: CCTV Video: రోడ్డుపై నడుస్తూ వ్యక్తి మృతి.. అదేనా కారణం?

పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం.. లోయలో పడిన కారు.. ఏడుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.