ETV Bharat / bharat

'వ్యాక్సినేషన్.. దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది' - నరేంద్ర మోదీ మన్​కీ బాత్

వ్యాక్సినేషన్​లో వంద కోట్ల మైలురాయి చేరిన తర్వాత దేశం సరికొత్త శక్తితో ముందుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi mann ki baat) అన్నారు. టీకా పంపిణీ కార్యక్రమం దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని పేర్కొన్నారు. ప్రజలందరికీ టీకా అందించే క్రమంలో దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు ఏ అవకాశాన్నీ విడిచిపెట్టలేదని కొనియాడారు.

modi mann ki baat
మోదీ మన్​కీ బాత్
author img

By

Published : Oct 24, 2021, 11:29 AM IST

Updated : Oct 24, 2021, 12:01 PM IST

వంద కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేసిన తర్వాత భారత్.. కొత్త శక్తితో ముందుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi latest news) అన్నారు. దేశంలో విజయవంతమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం.. భారత శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిందని చెప్పారు. మన్​కీ బాత్ (Modi mann ki baat) కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ఆయన.. ప్రజలందరికీ టీకా అందించే క్రమంలో దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు ఏ అవకాశాన్నీ విడిచిపెట్టలేదని (PM Modi news today) కొనియాడారు.

అక్టోబర్ 31న జరగనున్న జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు మోదీ. ప్రజలందరూ దేశ ఐక్యతను చాటి చెప్పే విధంగా కనీసం ఒక్క పనైనా చేయాలని పిలుపునిచ్చారు.

శాంతి కోసం కృషి..

ప్రపంచ శాంతి కోసం భారత్.. విశేషంగా కృషి చేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ఐరాస శాంతి పరిరక్షక దళాలకు అందిస్తున్న సహకారాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెప్పారు.

యోగాకు ప్రాచుర్యం..

మరోవైపు, యోగాకు విస్తృత ప్రాచుర్యం కల్పించేందుకు భారత్ ప్రయత్నిస్తోందని మోదీ తెలిపారు. మెరుగైన జీవన విధానం కోసం సంప్రదాయ పద్ధతిని పాటించేలా ప్రోత్సహిస్తోందని వివరించారు.

వోకల్​ ఫర్ లోకల్

మహిళా పోలీసుల సంఖ్య పెరగడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. 2014లో లక్షా 5 వేల మందిగా ఉన్న ఈ సంఖ్య... 2.15 లక్షలకు చేరుకుందని తెలిపారు. ప్రజలంతా 'వోకల్​ ఫర్ లోకల్'ను పాటించి.. పండగ సమయంలో స్థానిక ఉత్పత్తులే కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: Covid Festive Season: 'పండగలు వస్తున్నాయి.. జాగ్రత్త సుమీ!'

Last Updated : Oct 24, 2021, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.