ETV Bharat / bharat

'ఆ పది జిల్లాల్లోనే కొవిడ్​ వ్యాప్తి తీవ్రం' - దిల్లీలో కొవిడ్

దేశవ్యాప్తంగా కొవిడ్​ రెండో దశ ఆందోళనకరంగా మారింది. రోజురోజుకీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 10 జిల్లాల్లోనే కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్లు కేెంద్రం వెల్లడించింది.

centre on covid surge
ఆ పది జిల్లాల్లోనే కొవిడ్​ వ్యాప్తి తీవ్రం:కేంద్రం
author img

By

Published : Apr 6, 2021, 6:39 PM IST

దేశవ్యాప్తంగా 10 జిల్లాల్లోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయని కేంద్రం వెల్లడించింది. దేశంలోని క్రియాశీల కేసుల్లో సగానికిపైగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయని పేర్కొంది. 34 శాతం మరణాలు మహారాష్ట్రలోనే ఉన్నాయన్న కేంద్రం... ఆ రాష్ట్రంలోని 7 జిల్లాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉందని స్పష్టం చేసింది.

కర్ణాటక, ఛత్తీస్​గఢ్​, దిల్లీలోని ఒక్కో జిల్లాలో అధికంగా కేసులు నమోదవుతున్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలోని యాక్టివ్ కేసుల్లో 6 శాతం ఛత్తీస్​గఢ్​లోనే నమోదవుతున్నాయని, మరణాల సంఖ్య 3 శాతంగా ఉందని పేర్కొంది. పంజాబ్​లో మరణాల సంఖ్య 4.5 శాతంగా ఉందని తెలిపింది.

రాష్ట్రాలు ఆర్టీపీసీఆర్​ పరీక్షల నిర్వహణ పెంచాలని కేంద్రం సూచించింది. మహారాష్ట్రలో ఆర్టీపీసీఆర్​ పరీక్షల నిర్వహణ 60 శాతంగానే ఉందని ఆ సంఖ్య 70 శాతానికి పెరగాలని ఆదేశించింది.

ఇదీ చదవండి:'మే 2న టీఎంసీ కథ కంచికే!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.